హీరోయిన్ కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ వారసురాలు రాఘవి
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కుమార్తె రాఘవి త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అయితే నటిగా కాకుండా దర్శకురాలిగా అరంగేట్రం చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేస్తున్న ఆమె, ఇప్పటికే ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే తన తొలి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ‘కాంచన 4’తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘బెంజ్’ సినిమా చేస్తున్నాడు. ఈక్రమంలోనే లారెన్స్ కుటుంబం నుంచి ఇప్పుడో క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ వారసురాలు, ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే యాక్టరస్‌గా కాదు. సాధారణంగా స్టార్ వారసులు అనగానే నటన వైపు మొగ్గు చూపుతారు. కానీ రాఘవి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సు పూర్తి చేస్తున్నారు. ఆమెకు సినిమాలోని వివిధ విభాగాలపై మంచి అవగాహన ఉంది. తండ్రిలాగే లారెన్స్ కూడా రాఘవేంద్రస్వామి భక్తుడు కావడంతో తన కుమార్తెకు ‘రాఘవి’ అని పేరు పెట్టారు. అయితే ఆమె ఇప్పటివరకు మీడియా ముందుకు పెద్దగా రాకపోవడంతో, లారెన్స్‌కు ఇంత పెద్ద కుమార్తె ఉందనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రాఘవి ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిందని, ఫైనల్ డ్రాఫ్ట్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. అమెరికా నుండి చెన్నై తిరిగి వచ్చిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆమె స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మరి తండ్రిలాగే ఈమె కూడా హారర్ జానర్‌ను ఎంచుకుంటుందా? లేక సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక మహిళా దర్శకురాలిగా రాఘవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

