వంకాయతో 100 రోగాలు పరార్

07 June 2026

Pic credit - Instagram

Phani Ch

వంకాయ రుచిలో మాత్రమే కాదు.. ఆరోగ్యం విషయంలోనూ ముందుంటుందని పోషకాహార నిపుణులు నిపుణులు  చెబుతున్నారు.

ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణమయ్యేవాటి నుంచి కాపాడుతుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ఛాయిస్. రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

వంకాయ తీసుకోవటం వల్ల గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.

మెదడు కణాలను రక్షించి, జ్ఞాపకశక్తిని, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

అందుకే అటు రుచికి, ఇటు ఆరోగ్యానికి వంకాయను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. వంకాయలలో ఫైబర్ అధికంగా ఉండటంతో తిన్న తరువాత అరిగిపోతోంది.