AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

BSNL JTO Recruitment Notification: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 100 ఖాళీలను భర్తీ చేయనుండగా, తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 1 పోస్టు ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 3, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
BSNL JTO Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 07, 2026 | 5:58 PM

Share

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO – Telecom) కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు, తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2026 జులై 3 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2026 జూన్ 4 నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2026 జులై 3గా నిర్ణయించారు. దరఖాస్తులో ఏవైనా సవరణలు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జులై 4 నుంచి 11 వరకు అవకాశం పొందుతారు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,000 ఫీజుగా నిర్ణయించారు.

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలను 2026 ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు BSNL ప్రకటించింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 వరకు వేతనం అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us