Vaibhav Sooryavanshi : కారు ఉన్నా నడపలేడు.. యాడ్స్ లోనూ నటించలేడు.. బుడ్డోడికి ఎంత కష్టం వచ్చిందో పాపం !
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి టాటా సియెర్రా కారు బహుమతిగా లభించినా, 15 ఏళ్ల వయసు కారణంగా దాన్ని నడపలేడు. మైనర్ కావడంతో కార్ల ప్రకటనల్లో నటించే అవకాశమూ ప్రస్తుతం అతడికి లేదు.

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ఆడిన ఈ వండర్ కిడ్.. టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో కేవలం 16 మ్యాచ్‌లలోనే 48.50 యావరేజ్, 237.31 నాన్‌స్టాప్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. దాంతో అత్యధిక పరుగులు చేసినందుకు గానూ ప్రెస్టీజియస్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు ఏషియన్ గేమ్స్‌కు కూడా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
ఐపీఎల్‌లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కింద వైభవ్‌కు ఒక బ్రాండ్ న్యూ టాటా సియెర్రా ఎస్‌యూవీ కారు బహుమతిగా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ కారును వైభవ్ నడపడానికి వీల్లేదు. ఎందుకంటే భారత మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. ప్రైవేట్ కార్లు లేదా లైట్ మోటార్ వెహికల్స్ నడపాలంటే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వైభవ్‌కు ఇప్పుడు కేవలం 15 ఏళ్లే కావడం వల్ల, అతడు చట్టబద్ధంగా ఈ కారును రోడ్డుపైకి తీయలేడు. లైసెన్స్ రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటివరకు అతడు ఆగాల్సిందే.
ఈ కారు విషయమై రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిండర్ సోషల్ మీడియాలో వైభవ్‌తో ఒక సరదా ముచ్చట పెట్టారు. ఈ కారును ఏం చేస్తావ్? అని అడగ్గా.. వైభవ్ చాలా అమాయకంగా సమాధానమిచ్చాడు. “ఈ కారును మూడేళ్ల పాటు దాచి పెట్టుకుంటాను. ముందు నా డ్రైవింగ్ లైసెన్స్ రానివ్వండి, ఆ తర్వాతే డ్రైవింగ్ చేస్తాను. ప్రస్తుతానికి మా నాన్నను కారు నడపమని చెప్పి.. నేను పక్క సీట్లో కూర్చుని ముచ్చటపడతాను” అని నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్ వల్ల వైభవ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ అతడు కార్ల ప్రకటనలలో నటించడానికి వీల్లేదు. చట్టపరంగా మైనర్ అయినందున, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కార్ల యాడ్స్ లో నటిస్తే అది మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించినట్లు అవుతుందని ఈ నిబంధన పెట్టారు. కేవలం కార్లే కాకుండా వయసుకు సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మెన్స్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ వంటి వాటి ప్రకటనలకు కూడా వైభవ్ దూరంగా ఉండాల్సిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
