AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యతో మరోసారి పెళ్లి! భర్త వింత కోరిక.. కారణమేంటంటే..

ప్రేమించి పెళ్లిచేసుకున్నారు 22 ఏళ్లు ఒకరికొకరు తోడుగా నిలిచారు.  తన జీవిత భాగస్వామితో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయాలని ఉందన్న కోరికను భర్త వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ కలిసి ఆ కోరికను నెరవేర్చారు. అమెరికాలో ఈ హృదయవిదారక ఘటన వైరల్‌గా మారింది.

భార్యతో మరోసారి పెళ్లి! భర్త వింత కోరిక.. కారణమేంటంటే..
Man With Stage 4 Colon Cancer Renews His Vows With His Wife As Last Wish
Sharada V
|

Updated on: Oct 30, 2026 | 6:06 PM

Share

ప్రేమించి పెళ్లిచేసుకున్నారు 22 ఏళ్లు ఒకరికొకరు తోడుగా నిలిచారు.  తన జీవిత భాగస్వామితో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయాలని ఉందన్న కోరికను భర్త వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ కలిసి ఆ కోరికను నెరవేర్చారు. అమెరికాలో ఈ హృదయవిదారక ఘటన వైరల్‌గా మారింది.

2022లో బయటపడిన క్యాన్సర్

బ్రయాన్‌కు 2022 జూలైలో పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు సీటీ స్కాన్ చేయగా క్యాన్సర్ బయటపడింది. వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను పిలిపించి ఆ విషయం నిర్థారించారు. తన భర్తతో మరోసారి వివాహ ప్రమాణాలు చేయడం తనకు ఎంతో ముఖ్యమని భార్య టెర్రీ తెలిపింది. తన జీవితంలో బ్రయన్ ఎంతటి ప్రత్యేకమైన వ్యక్తో, ఆయన పట్ల తనకు ఎంత ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయో మరోసారి తెలియచేయాలి అనుకున్నట్లు చెప్పింది. తమ పిల్లల జీవితాల్లోనూ బ్రయన్ పాత్ర ఎంతో గొప్పదని భావోద్వేగానికి గురైంది.

22వ పెళ్లిరోజున మరోసారి ప్రమాణాలు

అమెరికాలోని ఆర్కాన్సాస్‌కు చెందిన బ్రయన్ రోజ్‌కు పెద్దపేగు క్యాన్సర్ (Colon Cancer) ప్రస్తుతం నాల్గవ దశలో ఉంది.  భార్య టెర్రీ రోజ్‌తో మరోసారి వివాహ ప్రమాణాలు చేయాలని ఉందని చెప్పడంతో 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ వేడుకను నిర్వహించారు. జీవితంలోని చరమాంకంలో ఉన్న ఆయన కోరికను నెరవేర్చేందుకు ‘విష్ అపాన్ ఎ వెడ్డింగ్’ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జంటలకు పెళ్లిళ్లు, వివాహ ప్రమాణాల వేడుకలు నిర్వహించేందుకు ఈ సంస్థ సహాయం చేస్తుంది. బెంటన్‌విల్లేలోని హాస్పిస్ కేంద్రంలో వివాహ ప్రమాణాల అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. కేక్, వినోద కార్యక్రమాలతో ఆ జంటకు మధురమైన జ్ఞాపకాన్ని అందించారు.

తొలిచూపులోనే ప్రేమ.. వెంటనే పెళ్లి నిర్ణయం!

బ్రయాన్ అనారోగ్యానికి ముందు ఈ జంట ఎంతో ఉత్సాహంగా, సరదాగా జీవితాన్ని గడిపేవారు. తొలిసారి బ్రయన్‌ను కలిసినప్పుడు అతనే తన జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయినట్లు టెర్రీ గుర్తుచేసుకుంది. 22 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి వివాహ ప్రమాణాలు చేసుకోవడం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. జీవిత భాగస్వామిపై బ్రయన్‌కు ఉన్న ప్రేమ, ఆయన పట్ల టెర్రీ చూపిస్తున్న అనురాగం నెటిజన్ల హృదయాలను తాకాయి.

45 ఏళ్లు దాటిన ప్రతి మగవారు కొలొనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని బ్రయన్  సూచించారు . తను ముందుగానే ఈ పరీక్ష చేయించుకుని ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.  సమస్యను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండటం ఎంతో ముఖ్యమని అన్నారు.

Follow Us