AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జిరాక్స్‌ సెంటర్ ముసుగులో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొత్త అద్భుతాలు సృష్టి్స్తే మరికొందరు మాత్రం.. అదే టెక్నాలజీని అక్రమ సంపాధన కోసం వాడుకుంటున్నారు. తాజాగా ఇలానే ప్రత్యేక ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ల సాయంతో అక్రమంగా ఆధార్, పాన్‌ కార్డులో వివరాలు మార్చుతూ డబ్బు దండుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.5,000 నగదు, 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: జిరాక్స్‌ సెంటర్ ముసుగులో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో
Man Arrested For Digital Forgery
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 5:46 PM

Share

రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారుచేస్తున్న అక్రమ దందా గుట్టురట్టయింది. ఆధార్, పాన్ కార్డుల్లో అక్రమ మార్పులు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. జల్పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన చింతల మహదేవ్ అనే వ్యక్తి బుద్వేల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ‘కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఈ మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఏడో తరగతి వరకు చదువుకున్న మహదేవ్, షాప్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రత్యేక ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ల సాయంతో ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మారుస్తూ దందాను ప్రారంభించాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచే ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. కార్డుల్లో కేవలం పుట్టిన తేదీ మార్చడానికి రూ.300, పూర్తి వివరాలు మార్చడానికి రూ.700 నుండి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నకిలీ గుర్తింపు కార్డులను కొందరు ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు పొందేందుకు, మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో బహిర్గతమైంది. నిందితుడి వద్ద నుంచి రూ.5,000 నగదు, 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ఒక ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ మెషిన్, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!
టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!
త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు..
కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు..
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?