Jyothika: సినిమా ఇండస్ట్రీలో అతనే నా బెస్ట్ ఫ్రెండ్.. మనసులో మాట చెప్పిన జ్యోతిక
సినీ పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్న జ్యోతిక, గతంలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తల్లిగా, నటిగా, ఒక సాధారణ గృహిణిగా తన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

స్టార్ హీరోయిన్ జ్యోతిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జ్యోతిక మాట్లాడుతూ.. తన పిల్లలు తన సినిమాలను చూసి గర్వంగా థియేటర్‌కు వెళ్లడం కంటే పెద్ద కాంప్లిమెంట్ ఏదీ లేదని స్పష్టం చేశారు. “నా పిల్లలు సిగ్గుపడేలా నేను ఎప్పుడూ చేయను. వాళ్ళు గర్వంగా తమ స్నేహితులతో వచ్చి నా సినిమా చూడాలి” అని ఆమె అన్నారు. ఈతరం పిల్లలకు అన్నీ ఉన్నా డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో, సినిమా ద్వారా సానుకూల సందేశాలు ఇవ్వడం ముఖ్యమని ఆమె అన్నారు. చంద్రముఖి సినిమా ఇంకా ఎన్ని తరాలు చూస్తారో తెలియదని, ఆ పాత్ర ప్రభావం గొప్పదని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల జ్యోతిక ఎంతో కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేశారు. “తెలుగు పరిశ్రమ చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటుంది. తెలుగువాళ్లు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు” అని ఆమె అన్నారు. తాను, సూర్య ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు తమను అంగీకరించి, ప్రేమించిన తీరు ఎంతో ప్రత్యేకమని జ్యోతిక పేర్కొన్నారు. చిరంజీవి ఠాగూర్, రవితేజ షాక్ వంటి చిత్రాలతో తెలుగులో నటించిన అనుభవాలను పంచుకున్నారు జ్యోతిక.
సూర్యతో తన బంధం గురించి మాట్లాడుతూ, కులం, మతం వంటి వాటిని తాను నమ్మనని, సూర్య తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. భర్త బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండటం కంటే గొప్ప విషయం ఏముంటుందని ఆమె అన్నారు. ఈతరం పిల్లల పెంపకంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, ప్రస్తుత పిల్లలు మరింత ఫ్రీడమ్, అభిప్రాయాలు కలిగి ఉన్నారని, వారికి కొంత స్పేస్ ఇవ్వడం ముఖ్యమని సూచించారు. కోవిడ్ తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా, పిల్లల విద్య కోసం చెన్నై నుంచి ముంబైకి మారినట్లు వివరించారు. ఒకరినొకరు మెచ్చుకోవడం, స్పేస్ ఇవ్వడం, గౌరవించుకోవడం మంచి వైవాహిక బంధానికి కీలకమని జంటలకు సలహా ఇచ్చారు జ్యోతిక.
అలాగే సినిమాల విషయానికొస్తే.. భాష కంటే కథ, పాత్రకే తాను ప్రాధాన్యత ఇస్తానని జ్యోతిక అన్నారు. మలయాళంలో మమ్ముట్టి గారితో ఒక సినిమా చేశానని, మంచి స్క్రిప్ట్ వస్తే ఏ భాషలోనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మంచి కథలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో చిన్న కలగా ప్రారంభించి, నేషనల్ అవార్డు స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని చెప్పారు. నార్త్, సౌత్ నటులు కలిసి రావడంతో సినిమా పరిశ్రమ మరింత గొప్పగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
