హస్కీ వాయిస్‌తో తియ్యగా మాట్లాడి.. కోట్లలో ముంచేసిందిగా
యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్‌పై వీసా, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (COS) పేరుతో భారీ మోసం చేసిన ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. 2023 నుంచే యూకే ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా, విచారణకు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.
యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. మూడేళ్ల కిందటే అంటే 2023నుంచి UKవేదికగా, మన ఇండియన్సే టార్గెట్‌గా నందన అండ్ ఫ్యామిలీ COS పేరుతో భారీ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024, సెప్టెంబర్‌లోనే నందన, ఆమె హజ్బెండ్‌పై సీఐడీలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది.. తియ్యగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి, డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని బాధితులకు వల విసురుతాలని చెబుతున్నారు. ఇలా ఎంతోమందిని మోసం చేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఈ కపుల్ పై.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనే కాదు, మాదాపూర్‌లోనూ కేసు నమోదైంది. అంతేకాదు యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్ షిప్ ఇప్పిస్తామని మోసం చేశారంటూ పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 50మందిపైగా బాధితులు నందన ఫ్యామిలీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందన యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు బాధితులు. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంది. మరోవైపు కేసు విచారణకు నందన ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో మధుకర్, రమానందన పై ఎల్వోసీ జారీ చేసారు ఇబ్రహీంపట్నం పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ వారసురాలు రాఘవి
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

