“అమ్మా.. నీ వెంటే నేను వస్తున్నా..” మృతదేహంపై పడి కన్నుమూసిన కూతురు!
జన్మనిచ్చిన కన్నతల్లి మరణవార్తను ఆ కూతురు తట్టుకోలేకపోయింది. అమ్మ ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక, ఆమె పార్థివ దేహంపై పడి ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. "అమ్మా.. నీ వెంటే నేను వస్తున్నా" అన్నట్లుగా తల్లి ఒడిలోనే కన్నుమూసిన ఈ హృదయవిదారక ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

జన్మనిచ్చిన కన్నతల్లి మరణవార్తను ఆ కూతురు తట్టుకోలేకపోయింది. అమ్మ ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక, ఆమె పార్థివ దేహంపై పడి ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. “అమ్మా.. నీ వెంటే నేను వస్తున్నా” అన్నట్లుగా తల్లి ఒడిలోనే కన్నుమూసిన ఈ హృదయవిదారక ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ముత్తగూడెం గ్రామానికి చెందిన అమృతమ్మ (75) అనే వృద్ధురాలికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త గతంలోనే మృతి చెందడంతో ఆమె గ్రామంలోని కుమారుడి వద్దే ఉంటోంది. అయితే, వయోభారంతో పాటు తీవ్రమైన వేసవి వడగాల్పుల కారణంగా అమృతమ్మ గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
తల్లి మరణవార్త వినగానే కుమార్తె పద్మ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ ముత్తగూడెం గ్రామానికి చేరుకుంది. అప్పటివరకు కళ్లముందే ఉన్న తల్లి ఇక లేదనే సత్యాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మృతదేహం వద్ద కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ఒక్కసారిగా గుండెపోటుకు గురై తల్లి పార్థీవ శరీరంపైనే కుప్పకూలి శ్వాస విడిచింది. ఒకే రోజు తల్లీకూతుళ్లిద్దరూ మరణించడంతో ముత్తగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల వేళ బంధువులు, గ్రామస్తులు పద్మకు తల్లిపై ఉన్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
