AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: బ్యాట్‌తో దుమ్మురేపిన సిరాజ్.. సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ వల్లే కాలేదు అలాంటి షాట్!

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా 564/8d భారీ స్కోర్ చేసింది. మహ్మద్ సిరాజ్ కేవలం 12 బంతుల్లో 22 పరుగులు (183.33 SR) చేసి విధ్వంసం సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలు నమోదు చేశారు. సాయి సుదర్శన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కూడా రాణించారు.

IND vs AFG: బ్యాట్‌తో దుమ్మురేపిన సిరాజ్.. సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ వల్లే కాలేదు అలాంటి షాట్!
Mohammed Siraj
SN Pasha
|

Updated on: Jun 07, 2026 | 4:54 PM

Share

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ బాల్‌తో కంటే ముందు బ్యాట్‌తో చిన్న పాటి విధ్వంసం సృష్టించాడు. ఇన్సింగ్స్ డిక్లేర్ చేయడానికి కొద్ది సేపు ముందు క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్.. టీమ్ స్కోర్ వీలైనంత ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో అల్ట్రా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేశాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసి.. టీమ్‌కు వ్యాల్యూబుల్ రన్స్ అందించాడు.

సిరాజ్ ఆడిన ఈ ఇన్సింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. అతని స్ట్రైక్ రేట్. ఏకంగా 183.33 స్ట్రైక్ రేట్‌తో సిరాజ్ బ్యాటింగ్ చేశాడు. టీమిండియా ఇన్సింగ్స్‌లో మిగతా అందరికంటే సిరాజ్ స్ట్రైక్ రేటే ఎక్కువ. పైగా ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్, 81 రన్స్‌తో రాణించిన సాయి సుదర్శన్ సైతం ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. కానీ మియా భాయ్ మాత్రం ఓ భారీ సిక్సర్‌తో అందరిని షాక్‌కు గురి చేశాడు. అది కూడా మామూలు సిక్స్ కాదు.. మంచి టైమింగ్, టెక్నిక్‌తో సూపర్‌గా కొట్టాడు. సిరాజ్ బ్యాటింగ్ చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న భారత క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్సింగ్స్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 177 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 126, కేఎల్ రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 పరుగులు చేసి సెంచరీలతో కదం తొక్కారు. అలాగే సాయి సుదర్శన్ 81, రిషభ్ పంత్ 81 వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి రాణించారు. తర్వాత తొలి ఇన్సింగ్స్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. సుతార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!