AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 Fish For Kids: చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!

చేపలలో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు పిల్లల శారీరక ఎముకల పెరుగుదలకు, కంటి చూపు మెరుగుపడటానికి మెదడు చురుకుదనానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే గొంతులో ముల్లు ఇరుక్కుపోతుందనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చేపలు పెట్టడానికి వెనుకాడతారు. అలాంటి వారి కోసం సాల్మన్, బాసా, తిలాపియా, కాడ్ సోల్‌ఫిష్ వంటి దాదాపు ముళ్ళు లేని లేదా వండిన తర్వాత ముళ్ళను సులభంగా వేరు చేయగల 5 రకాల మంచి చేపలు ఇవే.

 Fish For Kids: చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!
Fish Verieties For Kids
Bhavani
|

Updated on: Jun 07, 2026 | 5:01 PM

Share

సాధారణంగా చిన్న పిల్లలు చికెన్, మటన్ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే చేపల విషయానికి వచ్చేసరికి చాలా మంది తల్లిదండ్రులు భయపడుతుంటారు. పిల్లలు సొంతంగా చేపలు తినేటప్పుడు ఎక్కడ చిన్న ముల్లు గొంతులో ఇరుక్కుపోతుందో, ఎక్కడ ప్రాణాంతకమైన ప్రమాదం ఎదురవుతుందోననే భయంతో చిన్న పిల్లలకు చేపలు పెట్టడానికి అస్సలు సాహసించరు. దీనివల్ల చేపల ద్వారా పిల్లలకు అందాల్సిన అద్భుతమైన పోషకాలు అందకుండా పోతుంటాయి. ఈ గందరగోళాన్ని దూరం చేయడానికి పిల్లలు ఎంతో సురక్షితంగా, సొంతంగా తిని పూర్తి పోషణ పొందేందుకు వీలుగా ఉండే కొన్ని ముళ్ళు లేని లేదా చాలా తక్కువ ముళ్ళు ఉండే 5 మంచి చేపల రకాలను తెలుసుకుందాం.

పిల్లల కోసం 5 రకాల ముళ్ళు లేని ప్రత్యేక చేపలు 1. సాల్మన్ (Salmon): సాల్మన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో రుచికరమైన అత్యంత పోషకమైన చేపగా గుర్తింపు పొందింది. ఈ చేపకు సన్నటి ముళ్ళు అస్సలు ఉండవు. కేవలం చాలా తక్కువ సంఖ్యలో సులభంగా తీసేయగలిగే పెద్ద ముళ్ళు మాత్రమే ఉంటాయి. దీని మాంసం ఎంతో మృదువుగా ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల మెదడు అభివృద్ధికి, కంటి చూపు మెరుగుపడటానికి శరీర సమగ్ర ఎదుగుదలకు అద్భుతంగా సహాయపడతాయి.

2. బాసా (Basa): బాసా చేపలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, అందువల్ల చిన్న పిల్లలు కూడా దీనిని ఎలాంటి భయం లేకుండా సులభంగా తినవచ్చు. ఈ చేప రుచి చాలా తేలికగా (మైల్డ్ ఫ్లేవర్) ఉండి, పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను అందించడంలో ఒక మంచి మూలంగా పనిచేస్తుంది.

3. తిలాపియా (Tilapia): తిలాపియా చేపలో ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల శారీరక మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తుంది. రోహు లేదా కట్ల వంటి సాధారణ చేపలతో పోలిస్తే దీనికి ముళ్ళు చాలా తక్కువ. దీనికి ప్రధానంగా వెన్నెముక, పక్కటెముకల వద్ద మాత్రమే ముళ్ళు ఉంటాయి కాబట్టి వండిన తర్వాత వాటిని సులభంగా వేరు చేయవచ్చు. ముఖ్యంగా దీనిలో పిల్లలకు గుచ్చుకునే సన్నని పిన్ బోన్స్ అస్సలు ఉండవు. అలాగే ఈ చేపలో పాదరసం (మెర్క్యురీ) స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఎంతో సురక్షితం.

4. కాడ్ (Cod): కాడ్ చేప మాంసం ఎంతో సాఫ్ట్‌గా, తెల్లగా ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లల జీర్ణవ్యవస్థ దీనిని చాలా సులభంగా జీర్ణం చేసుకోగలదు. మార్కెట్లో దొరికే దీని ఫిల్లెట్లలో (కట్ చేసిన ముక్కలు) ఎముకలు అస్సలు ఉండవు. ఇది పిల్లల కళ్ళు, మెదడు, ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. దీనిలోని సెలీనియం, విటమిన్ బి12 ఇమ్యూనిటీని పెంచితే, విటమిన్ డి ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. దీనిని సూప్‌లలో కలిపి ఇవ్వవచ్చు లేదా ఆవిరిపై ఉడికించి, బేక్ చేసి లేదా ఫిష్ నగ్గెట్స్ రూపంలో పిల్లలకు తినిపించవచ్చు.

5. సోల్‌ఫిష్ (Sole Fish): ఈ చేప మాంసం కూడా నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిలో దాదాపుగా ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలు సొంతంగా తినగలరు. దీని రుచి కూడా చాలా తేలికగా ఉంటుంది. సోల్‌ఫిష్‌లో కూడా పాదరసం నిల్వలు చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో సురక్షితమైనదిగా వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

పిల్లలకు చేపలు తినిపించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల మెదడు కణాల అభివృద్ధికి తోడ్పడి, వారి జ్ఞాపకశక్తిని తెలివితేటలను వేగంగా పెంచుతాయి.

చేపలలో లభించే విటమిన్ డి కాల్షియం పిల్లల ఎముకలు, దంతాలు కండరాలను ఎంతో దృఢంగా మారుస్తాయి. క్రమం తప్పకుండా చేపలు తినే పిల్లల్లో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. చిన్న వయస్సులోనే అధిక పవర్ ఉన్న కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. దీనిలోని సెలీనియం, విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) బలోపేతం చేసి, పిల్లలు పదే పదే జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి.

Follow Us