AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. కాళ్ళ పారాణి ఆరకముందే మృత్యువు వెంటాడింది.. పాపం

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట ఆనందాన్ని రోడ్డు ప్రమాదం వేరుచేసింది.. ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు అక్కడే మృతి చెందగా.. వరుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఎన్నో ఆశలతో ఇద్దరూ పెళ్లి చేసుకోగా.. వారిని అనుకోని రోడ్డు ప్రమాదం వీడదీయడంతో.. ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి..

Telangana: అయ్యో దేవుడా.. కాళ్ళ పారాణి ఆరకముందే మృత్యువు వెంటాడింది.. పాపం
Crime News
P Shivteja
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 8:46 AM

Share

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట ఆనందాన్ని రోడ్డు ప్రమాదం వేరుచేసింది.. ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు అక్కడే మృతి చెందగా.. వరుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఎన్నో ఆశలతో ఇద్దరూ పెళ్లి చేసుకోగా.. వారిని అనుకోని రోడ్డు ప్రమాదం వీడదీయడంతో.. ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో సోమవారం జరిగింది.

దుబ్బాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చేప్యాలకు చెందిన సాయికుమార్‌, ప్రణతి (24) లకు ఇటీవల వివాహమైంది. ఈ క్రమంలో ప్రణతి, సాయికుమార్ లు ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి టూవీలర్ పై హైదరాబాద్ బయలుదేరగా.. ట్రాక్టర్ అదుపు తప్పి వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వధువు ప్రణతి దారిలోనే మృతి చెందింది.

ప్రస్తుతం సాయికుమార్ కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నవ దంపతుల జీవితంలో జరిగిన ఈ విషాద ఘటనతో..ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. దీంతో చెప్యాల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us