AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊర్లో ఉన్న ఒక్క టీవీ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా..

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే కాళిదాసు 2, మిస్టర్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. వీటికి తోడుగా తాజాగా మరో కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఊర్లో ఉన్న ఒక్క టీవీ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన  తెలుగు హిట్ సినిమా..
OTT Movie
Basha Shek
|

Updated on: May 14, 2026 | 12:58 PM

Share

హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోన్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. వి. మునిరాజ్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ ఎంటర్ టైనర్ లో కొత్త నటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరిలాగే ఆహ్లాదకరంగా సాగే కథా కథనాలు తెలుగు ఆడియెన్స్ ను బాగానే మెప్పించాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ప్రశంసలు అందుకున్న ఈ తిమ్మరాజుపల్లి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 15 నుంచి తిమ్మరాజుపల్లి సినిమాను స్ట్రీమింగ్ ను చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన కూడా చేసింది. అలాగే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు గురువారం అర్ధరాత్రి నుంచే తిమ్మరాజుపల్లి సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే రేపటి (మే 15) నుంచి రెగ్యులర్ సబ్ స్క్రైబర్లకు కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించారు. స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, తేజ విహాన్, టీవీ రామన్, చిట్టిబాబు, ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వంశీకాంత్ రేఖన సంగీతం సమకూర్చారు. 1996 సమయంలోని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ఆ ఊర్లో రాజప్ప (ప్రదీప్ కొట్టె)కు మాత్రమే టీవీ ఉంటుంది. అయితే అది దొంగతనానికి గురవుతుంది. మరి ఊర్లో ఉండే ఒకే ఒక్క టీవీని ఎవరు దొంగతనం చేశారు? హీరో, హీరోయిన్ల ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!