Telangana: ట్రైన్‌లోని జనరల్ భోగిలో ఘాటైన వాసన.. ఓ మూలాన ఉన్న బ్యాగులు చెక్ చేయగా
ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో 50 కేజీలు గంజాయి ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రైన్ లో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి పూణెకు తరలిస్తూ.. ఖమ్మంలో ట్రైన్ దిగిన నిందితులు వద్ద రెండు బ్యాగులను చెక్ చేయగా గంజాయి బయట పడింది.
ఖమ్మం జిల్లాలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఖమ్మం రైల్వేస్టేషన్ ఆవరణలో 25 లక్షల విలువైన 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలు జరుగుతున్న క్రమంలో నిందితులు ట్రైన్‌లో దిగి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న రెండు బ్యాగులను చెక్ చేయగా.. గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి పూణేకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి తరలివస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Published on: Nov 25, 2025 08:57 AM
వైరల్ వీడియోలు
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

