ఐ-బొమ్మ రవి మామూలోడు కాదు.. ఇది చూస్తే మొత్తం సినిమా మీకు అర్థమవుతుంది!
ఐ-బొమ్మ రవి. కొద్ది రోజులుగా తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతీ ఒక్కరి నోటా ఇదే పేరు. చట్టం దృష్టిలో అతడు నిందితుడు. కానీ సోషల్ మీడియా దృష్టిలో ఓ రాబిన్ హుడ్. రవి చేసింది తప్పు అని సినీ ప్రపంచం, చట్టప్రకారం నేరం అని పోలీసులు అంటున్నారు. కానీ సినీ అభిమానులు మాత్రం.. రవిని హీరోలా చూస్తున్నారు?
ఐ-బొమ్మ రవి. కొద్ది రోజులుగా తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతీ ఒక్కరి నోటా ఇదే పేరు. చట్టం దృష్టిలో అతడు నిందితుడు. కానీ సోషల్ మీడియా దృష్టిలో ఓ రాబిన్ హుడ్. రవి చేసింది తప్పు అని సినీ ప్రపంచం, చట్టప్రకారం నేరం అని పోలీసులు అంటున్నారు. కానీ వందల రూపాయిలు పెట్టుకుని టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడలేని సగటు సినీ అభిమాని మాత్రం.. రవిని హీరోలా చూస్తున్నారు? రవి విషయంలో ఎక్కడ లెక్క తప్పుతోంది? ఎక్కడ చిక్కు ముడి పడింది? ఈ మొత్తం సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్? అసలు.. ఐబొమ్మ రవి టోటల్ ఎపిసోడ్ ఏమిటి? ఈ వీడియోలో కంప్లీట్ డీటైల్స్ చూద్దాం.
పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఇది ఓ రకంగా మరణశాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. అదేం విచిత్రమో.. రవికి మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్‌హుడ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. చివరకు పోలీసుల పైనే మీమ్స్ చేశారు. దీంతో ఇలాంటి పని చేస్తే.. కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చేవరకు పరిస్థితి వచ్చింది. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది దన్నుగా నిలబడడానికి కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు? అనేది ఈ వీడియోలో చూడండి..
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

