AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.! మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఇలా.. ఈ జిల్లాలకు

తుఫాన్ ముంచుకొస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది అనేది వాతావరణ శాఖ ప్రకటించింది. అటు ఏపీ.. ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరి ఆ లేటెస్ట్ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Rain Alert: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.! మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఇలా.. ఈ జిల్లాలకు
Weather Report
Ravi Kiran
|

Updated on: Nov 25, 2025 | 7:17 AM

Share

మలేషియా పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఇవాళ దక్షిణ అండమాన్‌లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆపై 48 గంటల్లో వాయుగుండం బలపడుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తాలో మత్స్యకారులు స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. అల్పపీడనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు.. ఈ నెల 28 తర్వాత ఉత్తర కోస్తా జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. అయితే ఇవాళ శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. కాగా, వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షపాతం హెచ్చరికలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 29వ తేదీన.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతొ పాటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఈ నెల 30వ తేదీ, డిసెంబర్ 1న కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 2న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో మత్స్యకారులు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో ఇలా..

అటు తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 26 నుంచి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తోంది.

Follow Us