Watch Video: చిన్నారిపై 10 వీధికుక్కల మూకుమ్మడి దాడి.. వణకుపుట్టిస్తున్న షాకింగ్ వీడియో
Warangal stray dog attack:వరంగల్‌లో దారుణం వెలుగు చూసింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపైన వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మూకుమ్మడిగా ఒకేసారి పది కుక్కలకు పైగా కాపు కాసి దాడి చేశాయి.. ఆ చిన్నారిని పీక్కుతినేంత పని చేశాయి.. కుక్కలదాడిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ బాలిక అరుపులు విని అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పందించాడు.. ఆ కుక్కలపై రాళ్లతో దాడిచేసి తరిమి ఆ బాలిక ప్రాణాలు కాపాడాడు.

వరంగల్‌లో దారుణం వెలుగు చూసింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపైన వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మూకుమ్మడిగా ఒకేసారి పది కుక్కలకు పైగా కాపు కాసి దాడి చేశాయి.. ఆ చిన్నారిని పీక్కుతినేంత పని చేశాయి.. కుక్కలదాడిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ బాలిక అరుపులు విని అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పందించాడు.. ఆ కుక్కలపై రాళ్లతో దాడిచేసి తరిమి ఆ బాలిక ప్రాణాలు కాపాడాడు. ఈ దారుణ సంఘటన హనుమకొండలోని న్యూ శాయంపేట ప్రాంతంలో జరిగింది. చిట్టి అనే బాలిక చేతిలో కవర్ తో ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళుతుంది.. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా కాపు కాసి కూర్చున్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలికను చుట్టుముట్టాయి. సుమారు పది కుక్కలు ఆ బాలికపై పడి విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి.
కుక్కల దాడితో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. బాలిక కేకలు విన్న అటుగా వెళ్తున్న వ్యక్తి వెంటనే స్పందించి.. ఆ వీధికుక్కలపై రాళ్ల దాడి చేసి బాలిక ప్రాణాలు కాపాడాడు. కుక్కల దాడి నుండి తృటిలో బయటపడ్డ ఆ చిన్నారి మృత్యుంజయురాలు అయింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఇదిలా ఉండగా అదే సమయంలో హనుమకొండలోని లస్కర్ సింగారంలో మరో ఘటన జరిగింది.. ఒంటరిగా ఉన్న బాలుడిపైన వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి ఆ కుక్కలను తరిమేడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
నగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ.. చెలరేగిపోతున్నా, మనుషుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించరా అని నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్ములని కలిచి వేయొచ్చు.. సున్నిత మనుస్కులు ఈ వీడియోను చూడకండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




