Telangana: తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌.. తీర్మానాన్ని అతిక్ర‌మిస్తే 5వేలు జ‌రిమానా

జనగాం జిల్లా పాలకుర్తి మండల వ్యాప్తంగా రోజు రోజుకు రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పట్ణణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో...

Telangana: తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌.. తీర్మానాన్ని అతిక్ర‌మిస్తే 5వేలు జ‌రిమానా
Lockdown
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2021 | 9:31 AM

జనగాం జిల్లా పాలకుర్తి మండల వ్యాప్తంగా రోజు రోజుకు రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పట్ణణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పాలకుర్తి సోమేశ్వరాలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. కరోనా కట్టడికి తాజాగా మరిన్ని కఠిన చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో మే 20 వ తేదీ వరకు 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో పంచాయతీ పాలకవర్గం సమావేశమైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పాలకవర్గం సభ్యులు చర్చించారు. మండల వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా బారినపడి చాలా మంది చనిపోతున్నారు. అయినా ప్రజల్లో మాత్రం ఎలాంటి చైతన్యం రావడం లేదని సమావేశంలో గ్రామ పర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తప్పని పరిస్థితుల్లో సెల్ఫ్ లాక్ డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందన్నారు.

ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని అత్యవసర సేవల కోసం మాత్రమే మినహాయింపు ఇచ్చమన్నారు. పంచాయతీ తీర్మానాన్ని అతిక్రమించినా, మాస్కులు లేకుండా తిరిగినా 5 వేల రూపాయల జరిమానా విధిస్తామన్నారు. చట్టపరంగా కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని ఎస్.ఐ సతీష్ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు, గ్రామస్థులు స్వచ్ఛంద లాక్ డౌన్ కు మద్దతు తెలిపారు.

Also Read: ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​

 ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!