Agnipath Protest: అగ్నిపథ్‌తో రాత పరీక్ష క్యాన్సిల్.. రూ. 50 కోట్లు నష్టపోయిన సుబ్బారావు.. భారీ విధ్వంసానికి పక్కా ప్లాన్!

అగ్నిపథ్ పథకం ప్రవేశ పెడుతూ.. రాత పరీక్ష లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సుబ్బారావు దాదాపు రూ. 50 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేశాడు సుబ్బారావు..

Agnipath Protest: అగ్నిపథ్‌తో రాత పరీక్ష క్యాన్సిల్.. రూ. 50 కోట్లు నష్టపోయిన సుబ్బారావు.. భారీ విధ్వంసానికి పక్కా ప్లాన్!
Agnipatha Protest Subbarao
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2022 | 8:37 PM

Agnipath Protest: అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సృష్టించిన  విధ్వంసం కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుని పోలీసులు, ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన వీచయాలు వెలుగులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక ఆవుల సుబ్బారావు హస్తం ఉందని తేల్చరు.

భారీ ప్రణాళికతో 10కి పైగా వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి పక్కా ప్లాన్ తోనే స్టూడెంట్స్ ను రెచ్చగొట్టి.. భారీ విధ్వసం సృష్టించాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో సుబ్బారావుతో సహా.. ఇప్పటి వరకూ అదుపులోకి నిందితులను పోలీసులు రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు.

ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 బ్రాంచ్ లు నడిపిస్తున్నాడు సుబ్బారావు. ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో 2 లక్షలు ఫీజ్ తీసుకుంటున్నాడు. ఆర్మీ శిక్షణ కోసం చూస్తున్న అభ్యర్ధులు తన అకాడెమీ లో చేరాలా పేమెంట్స్ ను విడతల వారీగా చెల్లించేలా సూచించాడు. అంతేకాదు తన అకాడమీలో శిక్షణ తీసుకుంటే ఎంపిక గ్యారెంటీ అని హామీ ఇచ్చాడు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలాంటు అభ్యర్థులను ఆకర్షించాడు.  ఆర్మీ కి సెలెక్ట్ అయ్యిన తర్వాత మిగతా మొత్తం చెల్లించేలా అభ్యర్ధులకు కొటేషన్ ఇచ్చాడు. గ్యారెంటీ కింద అభ్యర్థుల కు చెందిన 10 వ తరగతి మెమో లు తన దగ్గరే పెట్టుకున్నాడు ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఆర్మీలో ఎంపిక ప్రాథమిక పరీక్ష పూర్తి చేశారు. ఇక రిటెన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే అభ్యర్థుల నుండి పెద్ద మొత్తం లో సుబ్బారావు కు ఫీజుల రూపంలో భారీగా సొమ్ము దక్కేది.

ఇవి కూడా చదవండి

అగ్నిపథ్ తో రూ.50 కోట్ల నష్టం: అయితే అగ్నిపథ్ పథకం ప్రవేశ పెడుతూ.. రాత పరీక్ష లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సుబ్బారావు దాదాపు రూ. 50 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేశాడు సుబ్బారావు..

ఐటీ అధికారుల విచారణ: పల్నాడు జిల్లా రావిపాడు పంచాయితీ పరిధిలో లో బై పాస్ రోడ్ లో సాయి అకాడెమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. సాయి డిఫెన్స్ అకాడెమీలో ఐటి అధికారులు 3 రోజుల పాటు  సోదాలు చేశారు. ఈ సోదాల్లో హార్డ్ డిస్క్ లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10 వ తరగతి మెమో లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు: సికింద్రాబాద్ ఘటన పై సిట్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అంతేకాదు అభ్యర్థులు రైల్వే స్టేషన్ బయట పార్కింగ్ లో ఉన్న టూ వీలర్స్ నుండి పెట్రోల్ తీసుకున్నట్లు గుర్తించారు. అభ్యర్థులు స్టేషన్ లో ఉన్న మొత్తం మూడు పార్కింగ్ స్లాట్స్ లో పెట్టిన  బైక్ లలో పెట్రోల్ తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్ళి బోగీలను తగలబెట్టినట్లు గుర్తించారు. మరి కొందరు తమ వెంట బయట నుండి పెట్రోల్ తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఏ ఏ పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ తీసుకున్నారో ఇప్పటికే పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపు లో నిజామాబాద్, కరింనగర్, వరంగల్ , ఆదిలాబాద్ కు చెందిన మరో 89 మంది అనుమానితులు ఉన్నారు. వీరిలో అల్లర్లలో కీలక పాత్ర పోషించిన వారందరిని చంచల్ గూడ జైల్లో రిమాండ్ చేయనున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో బోగీలకు నిప్పు పెట్టి, బోగీల అద్దాలను ధ్వంసం చేసిన పృథ్వీరాజ్ ను పోలీసులు ఏ12 నుంచి ఏ2గా మార్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..