Telangana Student: ఫిలిప్పీన్స్‌లో అసలేం జరిగిందో ఏంటో.. పుట్టిన రోజు నాడే.. మరణం..

పుట్టిన రోజు నాడే దారుణం చోటుచేసుకుంది.. ఆమె ఒక వైద్య విద్యార్థిని.. విదేశాల్లో చదువుకుంటోంది.. ఆమె పుట్టిన రోజును ఆనందంగా జరుపుకుంటుంది.. అని కుటుంబసభ్యులు భావించారు.. కానీ.. అలా జరగలేదు.. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది.

Telangana Student: ఫిలిప్పీన్స్‌లో అసలేం జరిగిందో ఏంటో.. పుట్టిన రోజు నాడే.. మరణం..
Crime News
Follow us
P Shivteja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2024 | 10:22 AM

పుట్టిన రోజు నాడే దారుణం చోటుచేసుకుంది.. ఆమె ఒక వైద్య విద్యార్థిని.. విదేశాల్లో చదువుకుంటోంది.. ఆమె పుట్టిన రోజును ఆనందంగా జరుపుకుంటుంది.. అని కుటుంబసభ్యులు భావించారు.. కానీ.. అలా జరగలేదు.. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన స్నిగ్ధ పుట్టిన రోజే ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోవడం కలకలం రేపింది..

ఫిలిప్పీన్స్‌ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న స్నిగ్ధ పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆమె గదిలో శవమై కనిపించారు. అది చూసిన స్నేహితులంతా ఒక్కసారిగా ఏం జరిగింది అనే భయాందోళనలోకి వెళ్లిపోయారు. అనంతరం స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి తెలియజేశారు.

సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి అమృత్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌ శాఖలో డీఈగా (డివిజినల్​ ఇంజినీర్​)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఫిలిప్పీన్స్‌ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. విదేశాలలో తెలుగు విద్యార్థుల మృతి కేసులు పెరుగుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కొందు యాక్సిడెంట్లలో..మరణిస్తుండగా.. కొందరి మృతికి కారణం తెలియకుండానే కాలం మారిపోతుండటం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విదేశాలు కావున.. కష్టంగా మారుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!