AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన ఏపీ సీఎం
Chandrababu Naidu Nara Ramamurthy Naidu
Balaraju Goud
|

Updated on: Nov 16, 2024 | 11:52 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు మంత్రి నారా లోకేష్.

సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటీన హైదరాబాద్‌ పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఢిల్లీతోపాటు మహారాష్ట్రలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని నేరుగా హైదరాబాద్‌కు బయల్దారు. ఢిల్లీలో ప్రముఖ దినపత్రిక కాంక్లేవ్‌లో పాల్గొని ఆయన హైదరాబాద్‌కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు.. బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు.

వాస్తవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం మహారాష్ట్రకు వెళ్లి.. ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడు నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని సైతం రద్దు చేసుకున్నారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ