ఎడారిలా మారిన చారిత్రత్మక చెరువు.. ఎన్ని రకాల చేపలు దొరికాయో తెలుసా..?

దాదాపు 8 రోజులు వ్యవధిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది. కాపువాడ ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు.

ఎడారిలా మారిన చారిత్రత్మక చెరువు.. ఎన్ని రకాల చేపలు దొరికాయో తెలుసా..?
Bhadrakali Lake
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 16, 2024 | 11:42 AM

వరంగల్ – హనుమకొండ జంట నగరాల మధ్య అతి పెద్ద జలాశయం భద్రకాళి చెరువు ఖాళీ అయింది.. నిత్యం నిండుకుండలా తునికిసలాడే చెరువు నీరంతా దిగువకు వదిలేయడంతో ఎడారిలా మారింది. ఆ చెరువులో లభ్యమైన రకరకాల చేపలతో మత్స్యకారులు, చేపల ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. చెరువు ఖాళీ అయింది.. మరి నెక్స్ట్ ఏంటి..? ఏం చేయబోతున్నారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చిన భద్రకాళి చెరువు ప్రస్తుతం సమ్మర్ వాటర్ స్టోరేజీ జలాశయంగా ఉపయోగపడుతుంది.. ఈ చెరువు క్రమక్రమంగా కబ్జాకు గురైపోవడంతో ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలోని మిగిలింది. మిగిలిన ఉన్న చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో చెరువు ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడ్డాయి. చెరువులో పూడిక తీసి, శుద్ధి చేయాలని, బౌండరీస్ ఫిక్స్ చేయాలని భావించారు. కొత్త అందాలతో అందులో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా నవంబర్‌ 9వ తేది నుండి చెరువు నీటిని దిగువకు వదిలేస్తున్నారు.

దాదాపు 8 రోజులు వ్యవధిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది. కాపువాడ ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు. భద్రకాళి చెరువులోని 150 mcft ల నీరంతా దిగువకు వదిలేశారు. చెరువు నీరంతా దిగువకు వదిలేయడంతో ఈ భారీ చెరువు ఎడారిని తలపిస్తుంది. చెరువు నీరంతా ఖాళీ అవడంతో మత్స్యకారులు, చేపల ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. రకరకాల చేపలు జాలర్లకు చిక్కడంతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా