AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బంక్‌కి కారులో వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారు.. కట్ చేస్తే..

పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇకపై అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే నేరగాళ్లు కొత్తరకం స్కామ్‌కు తెరలేపారు. దర్జాగా కస్టమర్‌లా వచ్చి.. డీజీల్, పెట్రోల్ కొట్టించుకుని పరారవుతున్నారు. తమకు ట్రాక్ చేయకుండా ఉండేందుకు.. నంబర్ ప్లేట్స్ వినియోగించడం లేదు. తాజాగా హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

Telangana: బంక్‌కి కారులో వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారు.. కట్ చేస్తే..
Petrol Pump
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 07, 2025 | 2:05 PM

Share

దోపిడీదారులు బరి తెగిస్తున్నారు.. విచిత్ర తరహాలో దోపిడీలకు పాల్పడుతున్నారు.. హనుమకొండ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన డీజిల్ దోపిడి ఘటన అంతా షాక్ అయ్యేలా చేసింది.. నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన దుండగులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు.. డెబిట్ కార్డు స్వైప్ చేస్తామని నమ్మించి సిబ్బందిపై దాడిచేసి ఎస్కేఫ్ పోయారు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆథారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.. వరంగల్ ను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలే ఈ రకమైన దోపిడీకి పాల్పడ్డారా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో జరిగింది.. పరకాల నడికూడ మధ్య ప్రధాన దారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు రాత్రి 10.44 నిమిషాల సమయంలో నెంబర్ ప్లేట్ లేని ఓ కార్ వచ్చింది.. డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొన్నారు.. సుమారు 11 వేల రూపాయల డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు..

స్వైప్ మిషన్ తీసుకురమ్మని బంకు సిబ్బందిని నమ్మించిన కారులోని కేటుగాళ్లు అక్కడినుండి పారి పోయారు.. వారిని వెంబడించిన సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు అతనిపై దాడిచేసి పారిపోయారు. పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు..సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు..

నెంబర్ ప్లేట్ లేని కారు ఎవరిది..? వరంగల్‌ను వణికిస్తున్న అంతరాష్ట్ర దొంగలు ఈ రకమైన దోపిడీ పాల్పడ్డారా.! లేక స్థానికులే ఎవరైనా మద్యం మత్తులో ఈ విధంగా దోపిడీకి బరితెగించారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?