AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పండుగ వేళ.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా లభించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగులే ప్రజా ప్రభుత్వానికి బలమని స్పష్టం చేసిన ఆయన… ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సంస్థల్లో అమలవుతున్న కోటి రూపాయల బీమాను ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు విస్తరించనున్నట్టు వెల్లడించారు.

Telangana: పండుగ వేళ.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..
Telangana government employees
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 5:02 PM

Share

తెలంగాణలోని.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులు.. తమ కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. 1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామని ఆ ప్రకటనలో వివరించారు.

ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్ కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వం చొరవతో చేపట్టిన కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా కార్యక్రమంతో ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు.  ప్రభుత్వ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.