AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి? EMI ఎంత?

Home Loan: సాధారణంగా మనం బ్యాంకు గృహ రుణం గానీ, ఇతర ఏవైనా రుణాలు తీసుకుంటే నెలవారీ ఆదాయం, ఇతర ఆస్తులు, సిబిల్ తదితర వివరాలను చెక్ చేసిన తర్వాతే రుణం అందించేందుకు మొగ్గు చూపుతుంది. అయితే ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే ఎంత జీతం ఉండాలి? ఈఎంఐ ఎంత ఉంటుందో తెలుసుకుందాం..

Home Loan: ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి? EMI ఎంత?
Bank Home Loan
Subhash Goud
|

Updated on: Jan 10, 2026 | 7:06 PM

Share

BOB Home Loan: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం కేవలం 7.20 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తోంది. గత సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మొత్తం 1.25 శాతం తగ్గించింది. దీనితో రెపో రేటు 5.25 శాతానికి తగ్గింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి.

ఈ మార్పు కారణంగా మధ్యతరగతి వారికి ఇల్లు కొనడం ఇప్పుడు కొంచెం సులభం అయింది. అటువంటి పరిస్థితిలో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రూ.50 లక్షల గృహ రుణం తీసుకోవాలనుకుంటే మీ నెలవారీ జీతం ఎంత ఉండాలి? EMI ఎంత ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Budget 2026: ఎవ్వరితో సంబంధం లేకుండా 10 రోజుల పాటు గదిలోనే బడ్జెట్‌ బృందం.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే కనీస వడ్డీ రేటు 7.20% ఆధారంగా రుణ కాలపరిమితిని బట్టి జీతం అర్హత మారుతుంది. మీరు 30 సంవత్సరాలకు రూ.50 లక్షల గృహ రుణం తీసుకుంటే, మీ నెలవారీ జీతం దాదాపు రూ.68,000 ఉండాలి. 25 సంవత్సరాల రుణానికి మీ నెలవారీ జీతం దాదాపు రూ.72,000 ఉండాలి. అయితే 20 సంవత్సరాల రుణానికి మీ నెలవారీ జీతం దాదాపు రూ.79,000 ఉండాలి. ఈ లెక్కింపు రుణగ్రహీతకు ఇతర యాక్టివ్‌గా ఉన్న రుణాలు లేదా EMIలు ఉన్నాయా? లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

రూ.50 లక్షల గృహ రుణంపై EMI ఎంత ఉంటుంది?

మీరు రూ.50 లక్షల గృహ రుణం 30 సంవత్సరాలకు తీసుకుంటే మీ నెలవారీ EMI దాదాపు రూ.34,000 ఉంటుంది. 25 సంవత్సరాల రుణంపై EMI దాదాపు రూ.36,000 ఉంటుంది. 20 సంవత్సరాల రుణానికి EMI దాదాపు రూ.39,000 నుండి రూ.39,500 వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: సంవత్సరాలుగా రైలు ప్రయాణం చేసే వారికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఏదైనా బ్యాంకు నుండి రుణం పొందడానికి మంచి క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. మీ క్రెడిట్ స్కోరు పేలవంగా ఉంటే బ్యాంకు రుణాన్ని ఆమోదించకపోవచ్చు. దీనితో పాటు బ్యాంకు మీ గత రుణ రికార్డు, చెల్లింపుల క్రమబద్ధత, ఆదాయ స్థిరత్వాన్ని కూడా తనిఖీ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ ఆర్థిక స్థితి, EMI చెల్లించే సామర్థ్యాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే