Budget 2026: ఎవ్వరితో సంబంధం లేకుండా 10 రోజుల పాటు గదిలోనే బడ్జెట్ బృందం.. ఎందుకో తెలుసా?
Union Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ తయారీలో ఉండే కసరత్తు అంతా ఇంతా కాదు. బడ్జెట్ వివరాలు బయటకు లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు చేపడుతుంది. బడ్జెట్ బృందం 10 రోజుల పాటు ఎవ్వరితో సంబంధం లేకుండా చర్యలు చేపడుతుంటుంది కేంద్రం..

Union Budget 2026: ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే.. బడ్జెట్ తయారీ బృందం 10 రోజుల పాటు ఒకే చోటికి ఎందుకు పరిమితం చేస్తారని. అంటే వారు ఉండే ప్రాంతం నుంచి ఎక్కడ కూడా వెళ్లేందుకు అనుమతి ఉండదు. తినే ఫుడ్‌తో సహా అన్ని వసతులు వారి వద్దకే వస్తాయి. ఇది వింతగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ప్రభుత్వానికి చాలా కఠినమైన, ముఖ్యమైన విధానం ఉంది. బడ్జెట్ దేశ ఆర్థిక దిశను నిర్ణయిస్తుంది. అందుకే దాని భద్రత, గోప్యత అత్యంత ముఖ్యమైనవి.
- బడ్జెట్ సమాచారం లీక్: బడ్జెట్‌లో పన్నులు, ఖర్చులు, సబ్సిడీలు, కొత్త పథకాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం ముందుగానే లీక్ అయితే అది స్టాక్ మార్కెట్ నుండి ప్రధాన వ్యాపార నిర్ణయాల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి బడ్జెట్ బృందాన్ని బయటి ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉంచుతారు. అంటే బయటి వ్యక్తులతో సహా కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండదు.
- లాక్-ఇన్ వ్యవధి: బడ్జెట్ సమర్పించడానికి దాదాపు 10 రోజుల ముందు లాక్-ఇన్ పీరియడ్ అని పిలిచే ఒక ప్రత్యేక ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో బడ్జెట్‌తో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులు, సాంకేతిక సిబ్బంది ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి లేదా ఎవరినీ కలవడానికి అనుమతి ఉండదు.
- మొబైల్, ఇంటర్నెట్, ఫోన్లపై నిషేధం: లాక్-ఇన్ కాలంలో అధికారుల మొబైల్ ఫోన్లు జప్తు చేస్తారు. ఇంటర్నెట్, కాల్ యాక్సెస్ కూడా నిలిపివేస్తారు. ఏదైనా సమాచారం అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా లీక్ కాకుండా ఇలా చేస్తారు.
- కుటుంబ సభ్యులకు కూడా దూరంగా: ఈ 10 రోజుల్లో బడ్జెట్ బృందం వారి కుటుంబాలను సంప్రదించలేకపోతారు. ఈ ఏర్పాటు కొంత కష్టం. కానీ బడ్జెట్ వంటి జాతీయ బాధ్యతకు ఇది అవసరమని భావిస్తారు. ప్రభుత్వం బడ్జెట్ పనులపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరుకుంటుంది. కుటుంబ సభ్యులు అత్యవసరమైన కాల్స్ చేయాల్సి వస్తే అక్కడ ప్రత్యేక బృందానికి కాల్స్ చేకయాల్సి ఉంటుంది. వారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అతి ముఖ్యమైన కాల్స్ అయితేనే వారితో మాట్లాడిస్తారు.
- హల్వా వేడుకతో ప్రారంభం: బడ్జెట్ బృందం లాక్-ఇన్ పీరియడ్ హల్వా వేడుక అనే ఆచారంతో ప్రారంభమవుతుంది. హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖలో తయారు చేసి హల్వాను అధికారులకు అందిస్తారు. దీని తరువాత బడ్జెట్ ముద్రణ, తుది సన్నాహాలు ప్రారంభమవుతాయి.
- గట్టి భద్రత: బడ్జెట్ తయారీ స్థలంలో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది. అధికారం కలిగిన సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాగితం, ఫైల్ లేదా డిజిటల్ డేటా ఏవీ బయటపడకుండా చూసుకోవడానికి ప్రతి కార్యాచరణను పర్యవేక్షిస్తారు.
- బడ్జెట్ లీకైన సందర్భాలు: భారతదేశ బడ్జెట్ చరిత్రలో బడ్జెట్ సమాచారం అనేక సందర్భాల్లో లీక్ అయింది. ఈ సంఘటనల నుండి నేర్చుకుని ప్రభుత్వం ఈ కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించే ముందు ఎవరికీ సమాచారం అందుబాటులో ఉండకుండా చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Indian Railways: సంవత్సరాలుగా రైలు ప్రయాణం చేసే వారికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




