Telangana: కోతుల మధ్య ఆకలి పోరు ఎలా ఉంటుందో తెలుసా.. వీడియో చూస్తే స్టన్ అవుతారు
లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేలా రెండు వానర గుంపుల మధ్య జరిగిన భీకర యుద్ధం వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో రెండు కోతుల గుంపులు పరస్పరం దాడికి దిగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇల్లందు ప్రాంతంలో నిత్యం సంచరించే వానరాల గుంపునకు బదులు వేరొక ప్రాంతానికి చెందిన కోతుల గుంపు ఒకటి వచ్చింది. 'మా ప్రాంతానికే వస్తారా? మీకెంత ధైర్యం' అన్నట్లుగా గ్రామంలో ఉంటున్న కోతుల గుంపు బయట నుంచి వచ్చిన వానర సైన్యంపై యుద్ధం ప్రకటించింది.

మనుషుల మధ్యే కాదు.. మూగజీవుల మధ్య కూడా ప్రాంతీయ ద్వేషాలు.. గట్టు పంచాయతీలు ఎలా ఉంటాయో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది.. ఒక ప్రాంత కోతులు మరో ప్రాంతంలో ఆకలి దాడి చేస్తే అక్కడి కోతులు ఏ విధంగా తిరగబడ్డాయో అక్కడ జరిగిన భీకర యుద్ధం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే… ఒకటి కాదు రెండుకాదు వేలాది కోతులు ఒకేచోట రెండు వర్గాలుగా ఏర్పడి రక్తం చిందెల రక్కుకున్న సంఘటన ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది.. కోతుల మధ్య బీకర యుద్ధం.. రక్తాలు కారేలా రక్కుకున్న వానర సేనలు.. ఊరంతా కర్ఫ్యూ వాతావరణం.. ఒక్కరు కూడా ఇళ్లలో నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి..
ఈ విచిత్ర ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగింది.. ఈ గ్రామంలో నిత్యం కోతుల గుంపు సంచరిస్తుంటాయి.. ఇక్కడి నుండి వచ్చాయో తెలియదు ఉదయాన్నే వందలాది కోతులు ఈ గ్రామానికి వచ్చాయి.. అవి కూడా కడుపు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కోతుల గుంపుకు వలస వచ్చిన కోతులకు మధ్య ఒక్కసారిగా వార్ మొదలైంది.. పరస్పర దాడుల్లో రక్తం చిందించాయి.. రెండు కోతుల గుంపుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.. కోతుల వార్ చూసి స్థానికులంతా హడలెత్తిపోయారు..
ఊరంతా కొంతసేపు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.. ఒక్కరు కూడా ఇళ్లలోనుండి బయటికి వెళ్ళని పరిస్థితి నెలకొంది.. దాదాపు రెండు గంటల పాటు కోతుల మధ్య బీకర వార్ జరిగింది. పరస్పర దాడులు చేసుకున్న కోతులు ఆ తర్వాత చల్లా చెదురై వెళ్లిపోయాయి.. వేలాది కోతులు ఊరిపై దండయాత్ర చేయడంతో ఊరంతా వనికి పోయారు.. ఆ కోతుల మధ్య జరిగిన బీకార పోరు చూసి ఊరంతా ఉలిక్కిపడింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..