TSRTC: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్.. ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. బస్సులు కొరత కారణంగా కొత్తగా 1,050 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

TSRTC: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్.. ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం..
Tsrtc Md Sajjanar
Follow us

|

Updated on: Dec 29, 2023 | 10:26 PM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. బస్సులు కొరత కారణంగా కొత్తగా 1,050 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో 512 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 92 లహరీ పుష్ బ్యాక్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నట్లు వివరించారు. ఇవన్నీ డీజల్ బస్సులేనని తెలిపారు.

ఈ డీజల్ బస్సులతో పాటు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. వీటిని విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 2024 మార్చి నాటికి అన్ని జిల్లాల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యం అన్నారు. డిశంబర్ 30 నుంచి కొన్ని అత్యాధునిక హంగులతో కూడిన బస్సులు నగరంలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మొత్తం 80 డీజల్ బస్సుల్లో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ పుష్ బ్యాక్ బస్సులుగా పేర్కొన్నారు. వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో సమయానికి బస్సులు రాక ప్రయాణీకులు ఇబ్బందులు పడినట్లు తమ దృష్టికి వచ్చిన తరుణంలో కొత్త బస్సులను రూ. 400 కోట్లు వెచ్చించి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..