RID Golden Jubilee Celebrations: కన్నుల పండుగగా RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు..హాజరైన మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు

RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొల్లాపూర్‌లో RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తమన్‌ టీమ్‌ మ్యూజికల్‌ షో సాగుతోంది.

RID Golden Jubilee Celebrations: కన్నుల పండుగగా RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు..హాజరైన మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు
Rid School And College Golden Jubilee Celebrations
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 29, 2024 | 10:58 PM

బాల్యపు అనుభూతులు మధురం…స్నేహపు మధురానుభవాలు మధురం. ..ఈ కలయిక మధురం..ఈ అల్యుమినీ మధురం.. అన్నట్టుగా నిలిచింది మూడురోజుల RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల సంబురం. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులను మిగిల్చిన రాణి ఇందిరా దేవి స్వర్ణోత్సవాలను తమ మనస్సులో పదిలంగా నింపుకున్నారు పూర్వ విద్యార్ధులు. తమతో చదువుకున్న స్నేహితులతో ఉత్సాహంగా గడిపారు.

ప్యానల్‌ డిస్కషన్‌లో.. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైహోం గ్రూపు అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌, బిట్స్‌ వీసీ ప్రొఫెసర్‌ వి. రామ్‌గోపాలరావు, హార్వార్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కే జయరాం రెడ్డి పాల్గొని తమ సక్సెస్‌ స్టోరీ, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చామన్నారు. చదువే తరగని ఆస్తి అన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సావనీర్‌లో.. కొల్లాపూర్‌ విద్యార్ధులకు చక్కని వాతావరణం కల్పించడమే RID విజన్‌ 2050 లక్ష్యమన్నారు. గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. స్కూలు భవనంలో పైలాన్‌ ఆవిష్కరించారు. కొల్లాపూర్‌లో RID గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తమన్‌ టీమ్‌ మ్యూజికల్‌ షో సాగుతోంది.

వీడియో: 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి