AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..

Revanth Reddy on CM KCR - YS Jagan: టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన నాటినుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడును మరింత పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్టును

Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..
పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒంటి కాలితో లేస్తున్నారు. మీరు రాళ్లతో కొడితే, మేం చెప్పులతో కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీఆర్ఎస్ శాసనసభ్యులు.
Shaik Madar Saheb
|

Updated on: Jul 01, 2021 | 7:17 PM

Share

Revanth Reddy on CM KCR – YS Jagan: టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన నాటినుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడును మరింత పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్టును నిలిపేందుకు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, ఎన్టీఆర్ లను తిట్టినవాళ్లంతా నికృష్టులేనంటూ విమర్శలు గుప్పించారు. అలాంటి వారికి కుష్టురోగం వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఒక్కటి అవుతున్న వేళ.. కొంత మంది కావాలని కృత్రిమ గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. సీమాంధ్ర తెలంగాణ ప్రజల మధ్య నీళ్ల పేరుతో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసులు అనగానే కేసీఆర్ కేంద్రం వద్దకు వెళతారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో పోరాడాలని సూచించారు.

రాష్ట్రంలో షర్మిలను బలోపేతం చేయడానికి కొంతమంది రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్‌లను తిడుతూ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నడూ లేనిది షర్మిల పార్టీ పెట్టినప్పుడే రాజశేఖర్ రెడ్డి ని ఎందుకు తిడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులను, రాజశేఖర్ రెడ్డి అభిమానులను రెచ్చగొట్టి షర్మిల వైపు తిప్పడానికె ఈ నాటకం ఆడుతున్నారంటూ పేర్కొన్నారు. న్యాయస్థానంలో తెలాల్సిన విషయాలపై గొడవలు రేపి విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ రేవంత్ మండిపడ్డారు. కృష్ణా నది నుంచి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జగన్ సమావేశం తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచారని ఆరోపించారు.

సబ్బండ వర్గాలన్నీ కేసీఆర్ చేతిలో బందీ అయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సమస్యలపై అనుబంధ విభాగాల అధ్యక్షులతో చర్చించానని తెలిపారు. అవసరమైన నీళ్లు, సంస్కృతి కేసీఆర్‌కు ఏటీఎం గా మారాయని పేర్కొన్నాు. పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఏ సెంటిమెంట్‌తో అయితే గద్దనెక్కిన కేసీఆర్ .. అదే సెంటిమెంట్‌తో పాతాళానికి పోతారన్నారు. నీళ్లు , నిధులు, నియామకాలు.. కేసీఆర్‌ను గద్దె దించుతాయని పేర్కొన్నారు.

Also Read:

వావ్ ! ‘స్వీటే ఆయుధం కాగా’… బర్త్ డే కేక్ విసిరి చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు.. ఎక్కడంటే..?

Viral Video: వ్యాక్సినేషన్ కేంద్రంలో మహిళ రచ్చో.. రచ్చ.. ఇంజక్షన్‌ చూసి భయంతో హంగామా.. వీడియో వైరల్