TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..

TS EAMCET 2021: కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌ పరీక్షల నిర్వహణపై బోర్డు దృష్టి సారించింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎంసెట్‌ దరఖాస్తులను..

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..
Ts Eamcet 2021
Follow us

|

Updated on: Jul 01, 2021 | 7:16 PM

TS EAMCET 2021: కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌ పరీక్షల నిర్వహణపై బోర్డు దృష్టి సారించింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎంసెట్‌ దరఖాస్తులను పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఎంసెట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లకు దరఖాస్తుల స్వీకరణ జులై 1 (నేటితో) ముగియాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తల స్వీకరణ గడువును మరోసారి పెంచారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 08-07-2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఎంసెట్‌ కన్వీర్‌ ప్రొఫెసర్‌ ఎ. గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్‌, బిఫార్మసీ, బయోటెక్నాలజీ సీట్ల అడ్మిషన్లకోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలంటే..

* విద్యార్థులు ముందుగా ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలోకి వెళ్లాలి. * అనంతరం ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. * తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ఫామ్‌ను నింపి.. ఫీజును చెల్లించాలి. * ఫొటోగ్రాఫ్‌, సిగ్నెచర్‌తో అవసరమైన ఇతర డ్యాక్యుమెంట్లను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. * చివరగా సబ్‌బిట్‌ నొక్కి తదనంతర అవసరాల దృష్ట్యా ఫామ్‌ను ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.

Also Read: Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.

Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..