వావ్ ! ‘స్వీటే ఆయుధం కాగా’… బర్త్ డే కేక్ విసిరి చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు.. ఎక్కడంటే..?

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2021 | 6:53 PM

మధ్యప్రదేశ్ లో జరిగిన విచిత్ర ఘటన ఇది..మోటార్ బైక్ పై వెళ్తున్న తమను వెంటాడుతున్న చిరుత పులి నుంచి రక్షించుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు భలే ప్లాన్ వేశారు. అసలది ఫలిస్తుందా లేదా అన్న మారు ఆలోచన కూడా లేకుండా దాన్ని 'అమలు చేశారు'. కానీ ఫలించి బతికి బయట పడ్డారు.

వావ్ ! 'స్వీటే ఆయుధం కాగా'... బర్త్ డే కేక్ విసిరి చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు.. ఎక్కడంటే..?
Birthday Cake Helps Madhyapradesh Brothers Escape Leopard

మధ్యప్రదేశ్ లో జరిగిన విచిత్ర ఘటన ఇది..మోటార్ బైక్ పై వెళ్తున్న తమను వెంటాడుతున్న చిరుత పులి నుంచి రక్షించుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు భలే ప్లాన్ వేశారు. అసలది ఫలిస్తుందా లేదా అన్న మారు ఆలోచన కూడా లేకుండా దాన్ని ‘అమలు చేశారు’. కానీ ఫలించి బతికి బయట పడ్డారు. వివరాల్లోకి వెళ్తే….మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో నివాసం ఉంటున్న ఫిరోజ్, సాబిర్ మన్సూరి అనే ఇద్దరు సోదరులు బైక్ పై సిటీకి బయల్దేరారు. తన కొడుకు బర్త్ డే సందర్భంగా ఫిరోజ్ సిటీలో కేక్ కొన్నాడు. ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా హఠాత్తుగా చెరకు తోటలో ఎక్కడ నక్కిందో గానీ ఓ చిరుత వీరిని చూసి వెంట పడింది. దీంతో భయపడిన సాబిర్ వాహనాన్ని వేగంగా నడపడానికి ప్రయత్నించినా.. రోడ్డు బురద మయంగా ఉండడంతో పెద్దగా ఫలితం లేకపోయిందట..దాంతో చిరుత వారిని 500 మీటర్ల దూరం వెంబడించింది. ఏం చేయాలో తోచని ఫిరోజ్ తన చేతిలోని బర్త్ డే కేక్ బాక్సును దానిమీదికి విసిరివేశాడు. బహుశా ఆ కేక్ వాసన దానికి తగిలినట్లుంది.. వీరిని వెంటాడడం మానేసి ఈ బాక్సును నోట కరుచుకుని మళ్ళీ చెరకు తోటలోకి దారి తీసింది.

మొత్తానికి అన్నదమ్ములిద్దరూ బతుకు జీవుడా అనుకుంటూ.. ఇంటిదారి పట్టారు. ‘స్వీటే మా ఆయుధమైంది’ అని వాళ్ళు ఆ తరువాత చమత్కరించారు. ఇలాంటి అనుభవం చాలా కొత్తగా..భయంగా కూడా ఉందని ఆ బ్రదర్స్ చెబుతుంటే అంతా కొయ్యబారి విన్నారట. కానీ..పాపం… ఫిరోజ్ కొడుకు బర్త్ డే కేక్ మాత్రం చిరుతపులి బారిన పడింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆదిత్య 369 లా.. కళ్యాణ్ రామ్ బింబిసార..! మూడు పాత్రలలో కనిపించనున్న నందమూరి హీరో :Kalyan Ram Bimbisara Movie.

 వైరల్ అవుతున్న వరుణ్ బాక్సింగ్ వీడియో…! గని సినిమా కోసం కష్టపడుతున్న మెగా ప్రిన్స్ :video of Varun Tej.

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు..కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మహిళ చేసిన మారాం..నవ్వకుండా వీడియో చుడండి :Viral Video.

ఈ చిన్నోడు ఓ టాప్‌ హీరో కొడుకు తెలుసా..?తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న స్మాల్ హీరో..:Star Hero Son video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu