AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Universities VC: తెలంగాణ యూనివర్సిటీల వీసీలకు దరఖాస్తుల వెల్లువ.. రికార్డు స్థాయిలో అప్లికేషన్లు..

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.

Universities VC: తెలంగాణ యూనివర్సిటీల వీసీలకు దరఖాస్తుల వెల్లువ.. రికార్డు స్థాయిలో అప్లికేషన్లు..
Universities Vice Chancellor
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 14, 2024 | 4:10 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.

ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది ఉన్నత విద్యా మండలి. అలాగే, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వీసీ పోస్ట్ కోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి రిజిస్టర్ పోస్టు చేయాలని పేర్కొంది.

జనవర 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు అప్లికేషన్లు తీసుకోగా పది విశ్వవిద్యాలయాలకు గానూ 1,382 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో కొంతమంది ఒక్క యునివర్సిటీ వీసీ కాకుండా , ఏదో ఒక యూనివర్సిటీకి రాకపోతుందా అని, రెండు అంతకుమించి వర్సిటీ వీసీ పోస్టుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికి 208 అప్లికేషన్లు రాగా, కనిష్టంగా జేఎన్ఏఎఫ్ఏయూకు 51 దరఖాస్తులు వచ్చాయి.

యూనివర్సిటీల వారీగా వచ్చిన అప్లికేషన్లు:

ఉస్మానియా యూనివర్సిటీ: 193

పాలమూరు యూనివర్సిటీ: 159

మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 157

శాతవాహన యూనివర్సిటీ: 158

తెలంగాణ యూనివర్సిటీ : 135

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ: 66

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ: 208

జేఎన్‌టీయూ-హైదరాబాద్: 106

జేఎన్ఏఎఫ్ఏయూ: 51

వీసీ దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వాటి స్క్రూటిని ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. వీటిని వడపోసి ప్రభుత్వానికి నివేదించనుంది. దీనికి అనుగుణంగా వైస్ చాన్సలర్ సెర్చ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీల సమావేశాలు జరిపి, నామినీల నియామకం పూర్తి చేస్తారు. UGC నామీనిల కోసం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం లేఖ రాశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి నామినిల జాబితా రాగానే ముగ్గురు సభ్యులతో యునివర్సిటీకి ఒక సెర్చ కమిటీ నియమిస్తారు. ఆ తర్వాత వీసీ పోస్టుల కోసం వచ్చి దరఖాస్తుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వైస్ చాన్సలర్లను నియామకాన్ని వేగవంతంగా పూర్తి చేసి విశ్వవిద్యాలయాల్లోని సమస్యలకు చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.