AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ నగరాల్లో NIELIT సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. సికింద్రాబాద్, తిరుపతిలో నగరాలలో NIELIT సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐటీ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి.. భారతదేశం మరింత పురోగతిని సాధించేందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి దిశగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ నగరాల్లో NIELIT సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..
Kishan Reddy - PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2024 | 3:55 PM

Share

NIELIT Centres in Secunderabad and Tirupati: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. సికింద్రాబాద్, తిరుపతిలో నగరాలలో NIELIT సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐటీ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి.. భారతదేశం మరింత పురోగతిని సాధించేందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి దిశగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సెంటర్ల ఏర్పాటుకోసం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పలుమార్లు చర్చించారు. దీనిపై చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుని ఈ సెంటర్లను సికింద్రాబాద్, తిరుపతిల్లో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.

సికింద్రాబాద్, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 3 ఏళ్ల వ్యవధిలో ఈ కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. NIELIT చెన్నై ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ కేంద్రాల కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించనున్నట్లు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒక్కో NIELIT కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాలలో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశం. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాలలో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి టెక్నాలజీ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు, వ్యాపారాల ఏర్పాటు పెంపొందించడానికి కూడా ఈ కేంద్రాల ద్వారా కృషి చేయడం జరుగుతుంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(NIELIT) అనే సంస్థ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుంది. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో NIELIT కీలకపాత్రను పోషిస్తుంది.

సికింద్రాబాద్, తిరుపతి నగరాలలో NIELIT కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర పడటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాలానుగుణంగా టెక్నాలజీ రంగాలలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను అందించే NIELIT కేంద్రాలను రెండు తెలుగు రాష్ట్రాల యువత కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!