Ragging: జూనియర్ విద్యార్థుల జుట్టును కత్తరించిన సీనియర్ విద్యార్థులు.. ఎందుకో తెలుసా?
ర్యాగింగ్.. ఈ పదమే వినిపించకూడదనేది ప్రభుత్వం, అధికారులు, పోలీసుల టార్గెట్. అయినా కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏకంగా జూనియర్ జుట్టు కట్ చేశారు సీనియర్లు. ఘటన గురించి పోలీసులకు తెలియగానే స్పాట్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్‌లో జూనియర్ మెడికో స్టూడెంట్‌ను పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనపై హాస్టల్‌లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. జూనియర్ మెడికో తల వెంట్రుకలు, మీసాలను ట్రిమ్మర్ తో ఇష్టానుసారంగా కట్ చేసి, ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత స్టూడెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
బాధిత విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మేడికో విద్యార్థులు, పోలీసుల మధ్య రహస్యంగా మీటింగ్ జరిగినట్లు తెలిసింది. కొందరు జూనియర్ విద్యార్థులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ కు ఫిర్యాదు చేయగా, విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కళాశాల ప్రారంభమైన రెండేళ్లలో తొలిసారిగా జరిగిన ఈ ర్యాగింగ్ ఘటన సంచలనం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…