AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని కదలించగా దగా దగా మెరుస్తూ..

నందిపేట్ లోని ఒక ఇంటి తులసి పీట కింద అరుదైన శ్వేతనాగును సురక్షితంగా స్నేక్ క్యాచర్ రెస్క్యూ చేశారు. పాముకాటుకు సంబంధించిన అపోహలను తొలగించి, నాటు వైద్యం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. పాములను తాకడం లేదా చంపడం చేయకుండా, వన్యప్రాణి నిపుణులను సంప్రదించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ రెస్క్యూ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని కదలించగా దగా దగా మెరుస్తూ..
Snake Rescue
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2026 | 7:51 AM

Share

నందిపేట్ ఆర్మూర్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఒక నివాసంలో ఇటీవల ఒక అరుదైన తెల్ల నాగుపామును విజయవంతంగా రెస్క్యూ చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో తులసి పీట కింద పాము ఉందని తెలియజేయడంతో స్నేక్ రెస్క్యూ నిపుణులు మున్నా తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఈ పాము మొదట సాధారణ తాచుపాములా కనిపించినా, రెస్క్యూ సమయంలో అది ఒక షైనింగ్ ఉన్న, అరుదైన శ్వేతనాగు అని గుర్తించారు. రెస్క్యూ చేసిన మున్నాకు దాదాపు 3000 పాములను రక్షించిన అనుభవం ఉన్నప్పటికీ, ఇంత తెల్లగా ఉన్న నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని తెలియజేశారు. ఈ ప్రాంతంలో గతంలోనూ అనేకసార్లు పాములను రక్షించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ చెరువు, పంట పొలాలు దగ్గరగా ఉండటం, అపరిశుభ్రమైన ప్లాట్లు, పెరిగిన పిచ్చి మొక్కలు పాములు ఇళ్లలోకి ప్రవేశించడానికి ప్రధాన కారణాలని వివరించారు. పంట పొలాలను కత్తిరించినప్పుడు లేదా తగులబెట్టినప్పుడు, వేడికి తట్టుకోలేక పాములు ఇళ్లను ఆశ్రయిస్తాయని తెలిపారు. పిల్లలు ఆడుకునే ప్రాంతాలలో పాములు ఉండటం చాలా ప్రమాదకరమని, కాబట్టి ప్లాట్ యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని,  పరిశుభ్రంగా నిర్వహించుకోవాలని సూచించారు. పాముకాటుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న అపోహలను, నాటు వైద్యం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలను నిపుణులు ఖండించారు.

పాము కరిచినప్పుడు నాటు వైద్యం చేయించుకోకుండా, వెంటనే జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని స్నేక్ క్యాచర్ నొక్కి చెప్పారు. పాములలో విషపూరితమైనవి, విషపూరితం కానివి ఉంటాయని, వెనమ్ బైట్, స్క్రాచ్ బైట్, టీత్ బైట్ అనే మూడు రకాల కాట్లు ఉంటాయని వివరించారు. టీత్ బైట్ లేదా స్క్రాచ్ బైట్ వల్ల మనిషికి ప్రమాదం లేదని, కానీ వెనమ్ బైట్ ప్రాణాంతకం కాబట్టి వైద్య సహాయం అవసరమని తెలిపారు. భారతదేశంలో 274 జాతుల పాములు ఉన్నప్పటికీ, వాటిలో కేవలం నాలుగే అత్యంత విషపూరితమైనవని, మిగిలిన 270 జాతులు విషరహితమైనవని నిపుణులు స్పష్టం చేశారు. “వానకోయిల” (వోల్ఫ్ స్నేక్) కరిస్తే షుగర్ వస్తుందనేది కేవలం అపోహ అని, భయం వల్ల వచ్చే టెన్షన్ తోనే స్పృహ కోల్పోవడం జరుగుతుందని వివరించారు. అలాగే, “పసరిక పాము” (గ్రీన్ వైన్ స్నేక్) మనుషులకు విషపూరితం కాదని, దానిలోని తేలికపాటి విషం పక్షులు లేదా చిన్న జీవులకు మాత్రమే ప్రమాదకరమని తెలిపారు. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు వాటిని ముట్టుకోవద్దని, చంపడానికి ప్రయత్నించవద్దని, ప్రాణనష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బదులుగా, శిక్షణ పొందిన నిపుణులను సంప్రదించి సురక్షితంగా రెస్క్యూ చేయించుకోవాలని వారు సందేశం ఇచ్చారు.

పాము రెస్క్యూ వీడియో దిగునవ చూడండి…

Follow Us