Telangana: రాంబుటాన్ పండ్ల కోసం ఎగెబడుతున్న జనం.. ఖమ్మం మార్కెట్‌లో ఆకట్టుకుంటున్న ఫ్రూట్స్..
Rambutan fruits: ఖమ్మం మార్కెట్ లోకి వచ్చిన ఈ పండ్లు వినియోగ దారులను ఆకట్టు కుంటున్నాయి.. ఈ పండ్లను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కిలో రాంబూటన్ పండ్ల ధర రూ. 400 గా అమ్ముతున్నారు. తీపి, పులుపు సమ్మిళితంతో ఉమ్మెంత కాయ ఆకారంగా ఎరుపు రంగులో ఉండే ఈ పండు.. తోలు చర్మం ఎర్రగా.. కండకలిగిన తేలికైన వెన్నుముకలతో కప్పబడి ఉంటుంది. అందుకే దీనికి 'వెంట్రుకలు' అని అర్థం. వెన్నుపూస పండు అని కూడా పిలుస్తారు. ద్రాక్షను గుర్తుకు తెచ్చే తీపి, తేలికపాటి ఆమ్ల రుచితో ఉంటుంది .
ఎరుపు రంగు లో కనిపిస్తున్న ఈ ఫ్రూట్స్ పేరు రాంబూటన్ పండ్లు..వీటిని ఎగబడి కొంటున్నారు.. ఎందుకో వీటికి అంత డిమాండ్ అనుకుంటున్నారా.. చూడండి.. ఖమ్మం మార్కెట్ లోకి వచ్చిన ఈ పండ్లు వినియోగ దారులను ఆకట్టు కుంటున్నాయి.. ఈ పండ్లను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కిలో రాంబూటన్ పండ్ల ధర రూ. 400 గా అమ్ముతున్నారు. తీపి, పులుపు సమ్మిళితంతో ఉమ్మెంత కాయ ఆకారంగా ఎరుపు రంగులో ఉండే ఈపండు మొదటగా తైవాన్, మలేషియా దేశాలలోనే లభ్యమయ్యేవి అట. ఆ తరువాత మన దేశంలోని శాస్త్రవేత్తలు సుమారు 70ఏళ్ల క్రితం కేరళలో పండించారు. అక్కడి నుంచి ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. ఈపండులోని గుజ్జు తినడం వల్ల విటమిన్ సి తో పాటు ప్రొటీన్స్ పుష్కలంగా లభిస్తాయి.
గుండె, కిడ్నీ, కండరాల పనితీరు మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుందని వైద్య నిపుణులు పేర్కోంటున్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లను నగరంలోని ఫ్రూట్స్ వ్యాపారులు కేరళ నుంచి తెప్పిస్తున్నారు. మంచి పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రూట్స్ గురించి తెలుసుకొని.. వినియోగ దారులు.. కొనుగోలు చేస్తున్నారు.. చూడటానికి అందంగా ఉండి ఆకట్టు కుంటున్నాయి.
ఈ పేరు ఎలా వచ్చిందంటే..
రంబుటాన్ అనే పేరు మలయ్ పదం రాంబుట్ నుంచి వచ్చింది. దీని అర్థం ‘జుట్టు’ అంటే పండ్లపై వెంట్రుకల్లా ఉంటాయి. వియత్నాంలో వీటిని చోమ్ చొమ్.. అంటే ‘గజిబిజి జుట్టు’ అని అర్థం.
రాంబుటాన్ పండులో ఉండే పోషకాలు
రాంబుటాన్ పండులో 78 శాతం వాటర్, 21 శాతం కార్బోహైడ్రేట్లు , 1శాతం ప్రొటీన్లు ఉన్నాయి. అతితక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. పోషకాల పరంగా, తయారుగా ఉన్న పండ్లలో మాంగనీస్ మితమైన స్థాయిలో ఉంటుంది. అంటే.. రోజువారీ విలువలో 16 శాతం కనిపిస్తుంది. అయితే 100 గ్రాముల సూచన మొత్తంలో (టేబుల్) 82 కేలరీలను అందిస్తుంది. ఇతర సూక్ష్మపోషకాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇందులో కేవలం 1 శాతం ఫ్రోటీన్లు ఉండటం వల్ల ఇది హార్ట్, యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారికి అద్భుతమైన వరం అని చెప్పవచ్చు.
ఈ పండును ఎలా తినాలి..
కొత్తగా మన రాష్ట్రంలో లభిస్తున్న పండ్లను ఎలా తినాలనే ప్రశ్న వస్తుంది. రాంబుటాన్ పండ్ల పై తొక్కను తొలగించి.. గుజ్జును తినడం, విత్తనాన్ని పడేయడం చేయాలి. పచ్చిగా తినవచ్చు. రాంబుటాన్ చాలా తరచుగా డిజర్ట్‌లలో, అంటే సోర్బెట్‌లు, పుడ్డింగ్‌లలో ఉపయోగిస్తారు. కానీ కూరలు, రుచికరమైన వంటలలో కూడా ఉపయోగిస్తారు. రుచి లీచీని పోలి ఉంటుంది. ఇతర ఉష్ణమండల పండ్లతో కలిపి తీసుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం