Kamalasan Reddy: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కరీంనగర్ సీపీగా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం సర్య్కులర్‌ను జారీ చేసింది. అయితే.. కమలాసన్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇద్దరు అధికారులు కూడా డీజీపీకి రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
వి. సత్యనారాయణ 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.. కాగా.. వి. బి. కమలాసన్ రెడ్డి 2004 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇప్పటికే సత్యనారాయణ రామగుండం సీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
వరంగల్‌లో ఐదుగురు ఇన్స్‌పెక్టర్ల బదిలీ.. ఇదిలాఉంటే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఇన్స్‌పెక్టర్లు బదిలీ అయ్యారు. డి.మల్లేష్ వి.ఆర్ నుంచి ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్‌కు బదిలీఅయ్యారు. జి. వేంకటేశ్వర్లు ఇంతేజార్ గంజ్ నుంచి వి.ఆర్‌కు, వి. వేణుమాధవ్ వి.ఆర్ నుంచి హన్మకొండకు, వై.చంద్రశేఖర్ గౌడ్ హన్మకొండ నుంచి సిటి స్పెషల్ బ్రాంచ్‌కు, ఎన్. ప్రభాకర్ రెడ్డి వి.ఆర్ నుంచి కాజీపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఉత్తర్వులు జారీచేశారు. Also Read: