Rain Alert: చురుకుగా రుతుపవనాలు.. తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు..

Rain Forecast in Telangana: నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో

Rain Alert: చురుకుగా రుతుపవనాలు.. తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు..
Rain Alert
Follow us

|

Updated on: Jul 02, 2021 | 10:34 AM

Rain Forecast in Telangana: నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంద్రప్రదేశ్ పరి‌సర ప్రాంతాల్లో ఉప‌రి‌తల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మరో వైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురు‌కుగా ఉన్నాయి. దీని ప్రభా‌వంతో జూలైలో సాధా‌రణ వర్షం కంటే.. ఎక్కువ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. జూలై నుంచి సెప్టెం‌బర్‌ వరకు పసి‌ఫిక్‌ మహా‌స‌ము‌ద్రంపై ప్రస్తుతం ఉన్న ఎల్‌‌నినో – సద‌రన్‌ అసి‌లే‌షన్‌ పరి‌స్థి‌తులు అలాగే కొన‌సా‌గొ‌చ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, వరంగల్ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లోని వరద నీరు చేరుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తనాలు విత్తుతున్నారు.

Also Read:

Modi Cabinet reshuffle: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి..! కొత్తగా 28 మందికి ఛాన్స్..!

Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..