Modi Cabinet reshuffle: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి..! కొత్తగా 28 మందికి ఛాన్స్..!

PM Modi Cabinet expansion: సెంట్రల్‌ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బీజేపీ లీడర్స్‌ వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ...

Modi Cabinet reshuffle: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి..! కొత్తగా 28 మందికి ఛాన్స్..!
Mod Cabinet Expansion
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 02, 2021 | 9:17 AM

సెంట్రల్‌ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బీజేపీ లీడర్స్‌ వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తి  నెలకొంది. కరోనా కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కసరత్తు పూర్తి చేసినట్టు పార్టీ సోర్స్ చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్‌ తెప్పించుకున్నారు. మంత్రివర్గ విస్తరణను ప్రధాని నరేంద్ర మోడీ ఒకటిరెండు రోజుల్లోనే చేపట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గత కొద్ది రోజులుగా మంత్రులను గ్రూపులుగా చేసి రివ్యూ జరిపారు. ఈ సమీక్షలో బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. మోదీ-షా-నడ్డాతోపాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తోడయ్యారు. కేంద్ర మంత్రుల భేటీ కసరత్తు పూర్తయినట్లు సమాచారం. శాఖల పనితీరును మదింపు చేసిన అనంతరం ప్రధాని జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), శర్వానంద్‌ సోనోవాల్‌ (అస్సాం)లతో పాటు బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బిహార్‌, గుజరాత్‌ల ఇన్‌ఛార్జిగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి వరుణ్‌ గాంధీ, రాంశంకర్‌ కథేరియా, అనిల్‌ జైన్‌, రీటా బహుగుణ జోషి, జాఫర్‌ ఇస్లాంల పేర్లు వినిపిస్తున్నాయి.

పశ్చిమబెంగాల్‌ నుంచి జగన్నాథ్‌ సర్కార్‌, శంతను ఠాకూర్‌, నీతీట్‌ ప్రామాణిక్‌లకు ఉత్తరాఖండ్‌ నుంచి అజయ్‌ భట్‌, అనిల్‌ బలూనీల్లో ఒకరికి కర్ణాటక నుంచి ప్రతాప్‌ సిన్హాకు కూడా అవకాశం దక్కొచ్చని సమాచారం. అశ్వనీ వైష్ణవ్‌ లేదా బైజయంత్‌ పాండా (ఒడిశా), బ్రిజేంద్ర సింగ్‌ (హరియాణా), రాహుల్‌ కస్వాన్‌ (రాజస్తాన్), పర్వేశ్‌ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ)లకు కూడా చోటు కల్పించవచ్చని తెలుస్తోంది.

మహారాష్ట్ర నుంచి నారాయణ్‌ రాణె, ఉదయన్‌రాజే భోస్లేలతో పాటు పూనమ్‌ మహాజన్‌ లేదా ప్రీతమ్‌ ముండేల్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాల్లో లోక్‌ జన్‌శక్తిలో చీలిక తెచ్చిన నేత పశుపతి పరాస్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు ప్రదానంగా వినిపిస్తున్నాయి. JDU నుంచి లల్లాన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, సంతోష్‌ కుశ్వాహాలకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..

Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్