AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి బట్టలు విప్పించి, ట్రిమ్మర్‌తో..

Ragging : సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకం సృష్టించింది. సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న

Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి బట్టలు విప్పించి, ట్రిమ్మర్‌తో..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Jan 03, 2022 | 10:55 AM

Share

Ragging : సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకం సృష్టించింది. సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న ఓ విద్యార్థి పట్టణ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల ఒకటవ తేదీన బాధిత విద్యార్థి వంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫోటోలు తీశారని సీనియర్లపై జూనియర్ విద్యార్థి కంప్లైంట్ ఇచ్చాడు. ట్రిమ్మర్ తో జుట్టు తొలగించేందుకు యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, సీనియర్ల నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పాడు బాదిత విద్యార్థి. విద్యార్థి తండ్రి డయల్ 100 కు ఫిర్యాదుు చేయడంతో పోలీసులు బాధిత విద్యార్థిని రక్షించారు.

ఈ ర్యాగింగ్ ఘటన సూర్యాపేట జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ర్యాగింగ్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని సూపరింటెండెంట్ తేల్చి చెప్పారు.

ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఆదేశం..

సూర్యాపేట ర్యాగింగ్ ఘటనను తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని వెల్లడించారు. కమిటీ రిపోర్ట్ రాగానే బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Also read:

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!

Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ఈసీకి విజ్ఞప్తి.. కారణం ఏంటంటే..

Vaccination:15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4.5 లక్షల మంది..