AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక్‌సభ ఎన్నికల నోడల్ అధికారులకు రాచకొండ కమిషనర్ కీలక సూచనలు

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సమీక్షించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగాద తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana: లోక్‌సభ ఎన్నికల నోడల్ అధికారులకు రాచకొండ కమిషనర్ కీలక సూచనలు
Tarun Joshi Review
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 23, 2024 | 7:48 PM

Share

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సమీక్షించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగాద తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎసీపీ నోడల్ అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు సీపీ తరుణ్ జోషి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీల బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు అన్ని అనుమతులను జాగ్రత్తగా జారీ చేయాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రాచకొండ సీపీ అన్నారు. ఎన్నికల ర్యాలీలకు అనుమతించే విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. మోడల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ సంబంధించి చట్టాలు, సెక్షన్ల మీద అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో శిక్షణా సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

రాచకొండ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు రాచకొండ సీపీ. పార్టీల ఊరేగింపు, ప్రచారం వంటి కార్యక్రమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఎలక్షన్స్ సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైనా ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న పెండింగ్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు మరియు పొక్సో కేసులను త్వరగా విచారించి దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…