PV Sindhu: నేనూ సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్‌లకు గురయ్యా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు..

PV Sindhu on Cyber bullying and trolling: హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా షీ -టీమ్ లు మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక భరోసాగా మారాయని

PV Sindhu: నేనూ సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్‌లకు గురయ్యా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు..
Pv Sindhu
Vijay Saatha

| Edited By: Shaik Madarsaheb

Jan 29, 2022 | 7:17 PM

PV Sindhu on Cyber bullying and trolling: హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా షీ -టీమ్ లు మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక భరోసాగా మారాయని ప్రముఖ అంతర్జాతీయ షట్లర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ.వీ. సింధు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘‘మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్ పై చైతన్య కార్యక్రమం’’ అనే అంశంపై నేడు రాష్ట్రంలోని వివిధ పాఠశాలలోని సైబర్ అంబాసిడర్లకు ప్రత్యేక చైతన్య కార్యక్రమం నిర్వహించింది. మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐజీ. బి.సుమతి పాల్గొన్న ఈ చైతన్య కార్యక్రమానికి షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ నేపథ్యంలో పెరిగిన ఇంటర్నెట్ వినియోగంతో సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని, ఇవి ప్రధానంగా మహిళలు, పిల్లల కేంద్రీకృతంగా అధికమయ్యాయని సింధు అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ-టీమ్‌లు ఉన్నాయనే భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు (Cyber Crime) గురైతే, వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలని పేరొన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే తనలాగా ఛాంపియన్ అవుతారని, అదేవిధంగా ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం ద్వారా సరికొత్త శక్తి లభిస్తుందని అన్నారు.

పిల్లలను గమనిస్తూ ఉండాలి.. తమ పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తుండాలని సింధు కోరారు. ఏదైనా సమస్యను పిల్లలు ఎదుర్కొంటే వాటిని అర్ధం చేసుకొని అధిగమించేందుకు చైతన్యం కల్పించాలని సింధు సూచించారు. సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను తానూ ఎదుర్కొన్నానని పీవీ సింధు వెల్లడించారు. ఈ సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను ధైర్యంగా ఎదుర్కోవడం తోపాటు వీటిపై పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇంటర్నెట్ వినియోగం నిత్యజీవనంలో ఒక బాగమైనదని, వీటిలో విద్యాపరమైన, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతోపాటు మానసిక వికాస కార్యక్రమాలను చూడడానికి ప్రాధాన్యత నిచ్చే విధంగా పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులను సైబర్ వారియర్లుగా తయారుచేయడం పట్ల సింధు అభినందించారు.

Pv Sindhu1

సైబర్ కాంగ్రెస్.. ఈ సందర్బంగా అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పెరిగిన మొబైల్ వాడకం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగాయని అన్నారు. ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రం లోని ప్రతీ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయినికి సైబర్ నేరాలను ఏదుర్కొనేందుకు సైబర్ కాంగ్రెస్ అనే పేరుతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రెండు వేళా మంది ఉపాధ్యాయినీలు, 3500 విద్యార్థినులకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.

Pv

Also Read:

తెలుగు వాళ్లు నష్టపోతున్నారు.. రైల్వే రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రక్షాళన చేయాలి.. కేంద్రమంత్రికి వినోద్ కుమార్ లేఖ

Minister KTR: ఓఆర్ఆర్ పరిధిలో ఇక నీటి కష్టాలుండవు.. మహేశ్వరంలో రూ.200 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu