Telangana: రూ.300 కోట్లతో హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్‌లో ఆదివారం రోజున శంకుస్థాపన చేశారు. ఇందులో ఈ కార్యక్రమంలోని భాగంగానే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 898 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వే వ్యవస్థను ఎప్పుడూ లేనట్లుగా అభివృద్ధి చేందిందని అన్నారు. భారతీయ రైల్వేలో అనేక మార్పులు జరుగుతున్నాయని అన్నారు. 2014 సంవత్సరం నుంచి చూసుకుంటే 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ కూడా 17 రేట్లు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను ఏకంగా 300 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నామని వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్‌లోని రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలాగే ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదని ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్‌లో ఆదివారం రోజున శంకుస్థాపన చేశారు. ఇందులో ఈ కార్యక్రమంలోని భాగంగానే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో 898 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకం ప్రకారమే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, హఫీజ్ గూడ, మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి. అలాగే కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం,నిజామాబాద్ తదితర జిల్లాలో సైతం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.




మరోవైపు కరీంనగర్‌లోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. మరోవైపు చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్టీవో తప్పించి.. మిగతా ఏ అధికారులు హాజరుకాకపోవడం దారణమని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో అధికార యంత్రాంగంపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ నిర్మించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యాదాద్రి ఆలయానికి హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైలు నిర్మాణం చేపట్టడం విశేషం. అయితే ఈ నిర్మాణం ఎప్పటివరకు పూర్తి అవుతుంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లోని మెట్రో రైళ్ల విస్తరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
