Ponguleti Srinivasa Reddy: ఆయనేమన్న దేవుడా.. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Ponguleti Srinivasa Reddy: డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజా సేవ చేయడం కోసమే వచ్చా.. కేసీఆర్ ఏమైనా దేవుడా.. అందరిలానే నేను మోసమోయా.. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ponguleti Srinivasa Reddy Exclusive Interview: డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజా సేవ చేయడం కోసమే వచ్చా.. కేసీఆర్ ఏమైనా దేవుడా.. అందరిలానే నేను మోసమోయా.. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రజనీకాంత్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బైపోల్ తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి ఆ పార్టీలో చేరానని, ప్రజల్లాగానే తానూ మోసపోయానన్నారు. ఇక మంత్రి హరీష్ రావు తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌తో పోటీ.. పడకపోవడానికి ఆయనేమన్న దేవుడా అని ప్రశ్నించారు పొంగులేటి. కేసీఆర్ చెప్పే ప్రతి అబద్ధాన్ని.. నిజాలతో కౌంటర్ చేస్తానంటున్నారు.
ఖమ్మం రాజకీయాలపై..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఓడించడానికి తాను పని చేస్తే.. 2019 పార్లమెంట్ ఎన్నికల టైమ్‌లో మళ్లీ తన సేవలు ఎందుకు వినియోగించుకున్నారని ప్రశ్నించారు. నామా నాగేశ్వరరావు గెలుపు కోసం తనను ఎందుకు పని చేయమన్నారని నిలదీశారు. భట్టిని ఓడించడానికి తాను కాంగ్రెస్‌లో చేరలేదని పొంగులేటి పేర్కొన్నారు.
షర్మిల చేరితే..
తాను ప్రకటించిన అభ్యర్థులకు టికెట్ ఇప్పిస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు పొంగులేటి. ప్రకటించిన అభ్యర్థులందరికీ టికెట్ ఇస్తేనే నా వెంట ఉంటారా అని ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.




ఈటలతో స్నేహం ఉన్నా..
ఈటల రాజేందర్‌తో స్నేహం ఉన్నా.. రాజకీయంగా యుద్ధం తప్పదన్నారు. విమర్శల దాడి పక్కా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనను ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానిదే హవా. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఉందా అంటే.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కేవలం ఆయన సామాజిక వర్గం వారే ఓట్లు వేస్తే గెలిచారా అని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
