Telangana: ‘మాటల మనిషిని కాదు.. మళ్లీ గెలుస్తా’.. పొంగులేటి సంచలన కామెంట్స్..
నేను మాటల మనిషిని కానని మనమంతా ఓకే గూటికి రావాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు ఇచ్చారు. మళ్ళీ ప్రజాప్రతినిధిగా తాను గెలుస్తానని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ముదిగొండలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు.నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని..
నేను మాటల మనిషిని కానని మనమంతా ఓకే గూటికి రావాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు ఇచ్చారు. మళ్ళీ ప్రజాప్రతినిధిగా తాను గెలుస్తానని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ముదిగొండలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు.నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్లమెంట్ అభ్యర్ధిగా టికెట్ ఇచ్చేసమయం నుంచి నాకు, నా అనుచరులకు ఎన్ని అవమానాలు జరిగాయో తెలంగాణ ప్రజలంతా చూశారన్నారు. గత జనవరి నుంచి ఈ అవమానాలు మరింత ఎక్కవయ్యాయన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి,.కేసీఆర్ మాటల మనిషి,తాను మాటాలు చెబితే మూడోసారి కూడా ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకంతో ఉన్నారు కానీ, యువతకి ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రైతు రుణ మాఫీ మాటలు ఏమయ్యాయి ఇవన్నీ అబద్దాలేనా హామీలు అమలు చేయని కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు పొంగులేటి శ్రీనిసవాస్ రెడ్డి
రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల ను ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు. ప్రజాప్రతినిధిగా మీ మధ్య ఎలా ఉన్నానో మీ దీవెనలతో గెలిచి భవిష్యత్ లో కూడా మీ మధ్యే ఉంటానన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఆనాడు ప్రజాప్రతినిధులుగా కావడానికి మీ అందరికీ అండగా ఉన్నాను .కష్టాల్లో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ మనను పట్టించుకో లేదన్నారు.నాలుగు సంవత్సరాల్లో ఎంతహీనంగా చూశారో మీరు గుర్తుంచుకోవాలన్నారు.నేను మాటల మనిషిని కాదు చేతలమనిషి నని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..