KTR: వర్షాకాల సంసిద్ధతపై కేటీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. అధికారులకు కీలక సూచనలు.
రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలాల అభివృద్ధి, జీహెచ్ఎంసీ సన్నద్ధతపై శనివారం మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జూన్ 1వ తేదీ నాటికి సన్నద్ధత పనులు పూర్తి కావాలన్నారు. అప్పుడే వర్షాకాలంలో..
రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలాల అభివృద్ధి, జీహెచ్ఎంసీ సన్నద్ధతపై శనివారం మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జూన్ 1వ తేదీ నాటికి సన్నద్ధత పనులు పూర్తి కావాలన్నారు. అప్పుడే వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలమన్నారు. వరద ముంపు, సహాయక చర్యలు, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, రహదారులపై నీరు నిలవడం, రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, నాలాల పూడికతీత, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నంకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షకాల సన్నద్ధత పనుల కోసం ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహాణ విభాగంతో ఇతర విభాగాలు కలసి సమన్వయంతో ఒక ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల ప్రమాదం సంభవించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్న పాత భవనాల గుర్తింపు అత్యంత కీలకమని ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని జీహెచ్ఎంసీకి సూచించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులను పూర్తి అయితే వరద ముంపు ప్రమాదాన్ని అరికట్టేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ అన్నారు. నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడిక తీతను తొలగించాలని మంత్రి అధికారులను అదేశించారు.
ఇప్పటికే ఈ నాలా అడ్డంకులను తొలగించేందుకు,ఎస్ఎన్ డిపి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిధులను సైతం కేటాయించిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న కేటీఆర్, ప్రస్తుతం ఎస్ఎన్ డిపి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న నాలాల బలోపేతం చేసే కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..