‘అది నా మనస్తత్వం కాదు, కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌కి పరిమితం చేయడమే మా లక్ష్యం’.. టీవీ9 ఇంటర్వ్యూలో పొంగులేటి..

Ponguleti Srinivas Reddy: తాను తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదని, నా ముందు ఉన్న నాయకుడు, ప్రజల కోసమే నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో మంగళవారం..

‘అది నా మనస్తత్వం కాదు, కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌కి పరిమితం చేయడమే మా లక్ష్యం’.. టీవీ9 ఇంటర్వ్యూలో పొంగులేటి..
Ponguleti Srinivas Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 04, 2023 | 8:01 PM

Ponguleti Srinivas Reddy: తాను తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదని, నా ముందు ఉన్న నాయకుడు, ప్రజల కోసమే నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో తన చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పదవులు అవసరం లేదు. 2019 ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నాకు బీఆర్ఎస్ నుంచి అవకాశం లభించపోయిన నేను పార్టీని వీడలేదు. నా కంటే ఒక్క రోజు ముందు చేరిన వ్యక్తికి అవకాశం ఇచ్చినా నేను తొందరపడలేదు. పదవులు రాలేదని నిముషాల్లో నిర్ణయం తీసుకునే మనస్తత్వం కాదు. నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది. ఆ రోజున కూడా కాంగ్రెస్, బీజేపీ నుంచి అవకాశం ఇస్తామని పిలుపులు వచ్చాయి. కానీ నేను తొందరపడలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నాయకుడి వెంట, ప్రజల వెంట ఉండాలని తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

ఇంకా ‘బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. దళిత బంధు వంటివి కూడా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి తీసుకున్న నిర్ణయమే. ఆ తర్వాత అలా కొన్ని మండలాల్లో శాంపుల్‌గా తీసుకొచ్చారు. అందుకే ఆ పార్టీని వీడాను. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. మా ఆశయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దోపుచులాడిన కేసీఆర్‌ని ఫామ్ హౌస్‌కి పరిమితం చేయడమే మా లక్ష్యం. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాన’ని పొంగులేటి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..