- Telugu News Photo Gallery Cricket photos After ODI World Cup 2023, Team India will have a Tight Schedule as Bilateral Series with Australia, South Africa, England, Sri Lanka, New Zealand And Bangladesh
Team India Schedule: వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీ.. టీ20 వరల్డ్‌కప్ సహా 2024లో భారత్ షెడ్యూల్ ఇదే..
Team India Schedule: వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. అదే రీతిలో మెగా టోర్నీ ముగిసిన నాటి నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ నెల వరకు పలు జట్లతో ద్వైపాక్షిక సీరిస్‌లతో బిజీ బిజీగా గడపనుంది. మరి భారత్ వేదికగా జరిగే క్రికెట్ కార్నివల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 03, 2023 | 5:16 PM

IND vs AUS: భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో టీమిండియా ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ భారత్‌లోనే జరుగుతుంది.

SA vs IND: డిసెంబర్-జనవరి మధ్యలో భారత్.. సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలుI, 3 టీ20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది.

IND vs ENG: టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు జనవరి-మార్చిలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది.

T20 World Cup 2024: జూన్ నెలలో వెస్టిండీస్, ఆమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియా ఆడనుంది.

SL vs IND: జూలైలో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది.

BAN vs IND: సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించి ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 టీ20లు ఆడుతుంది.

NZ vs IND: అలాగే అక్టోబర్‌లో న్యూజిలాండ్ వెళ్లి కివీస్ ప్లేయర్లతో టీమిండియా 3 టెస్టులు ఆడుతుంది.

ఇంకా 2024 చివర్లలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. కంగారుల జట్టు తన పర్యటనలో భాగంగా టీమిండియాతో 5 టెస్టులు ఆడుతుంది.




