- Telugu News Photo Gallery Cricket photos Ashes 2023: Nathan Lyon Ruled Out Of Remaining Ashes Series and Cricket Australia Announce Squad For Third Test
Ashes 2023: మూడో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. సిరీస్‌కి దిగ్గజ స్పిన్నర్ దూరం.. ఆ యువకుడికే ఆవకాశం..!
Ashes 2023, Australia Team: జూలై 6 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీ వేదికగా జరగబోయే యాషెస్ మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అలాగే రెండో టెస్టులో గాయపడిన లియాన్ పూర్తి సిరీస్‌కి దూరం అయ్యాడు.
Updated on: Jul 03, 2023 | 3:52 PM

Ashes 2023: లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో మరో విజయం సాధించిన ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదే తరహాలో మూడో టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే తపనతో ఉంది.

ఇక జూలై 6 నుంచి హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ మూడో టెస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

అంతేకాక రెండో టెస్టులో గాయపడిన ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో టాడ్ మర్ఫీని ప్లేయింగ్ 11 కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది.

గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన నాథన్ లియోన్ స్థానంలో మరో ప్లేయర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించలేదు. అంటే తొలి రెండు టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశం ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించిందని అర్థమవుతుంది.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషెన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్, జిమ్మీ పియర్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్





























